News July 16, 2024
ఈనెల అంతా వారికి రామనామస్మరణే!

శ్రీరాముని కోసం కేరళలోని హిందువులు ప్రత్యేకంగా ఓ నెలనే కేటాయించారు. కర్కిదకమ్ నెలను రామాయణ మాసంగా జరుపుకోవడం 1982లో ప్రారంభమైంది. ఈ నెలంతా శ్రీరామస్మరణ, రామాయణ పఠనంతో వేడుకలు చేసుకుంటారు. ‘నలంబల దర్శనం’లో భాగంగా కొట్టాయం, త్రిస్సూర్ జిల్లాల్లోని రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల ఆలయాలను భక్తులు దర్శించుకుంటారు. ఈరోజే ప్రారంభమైన ఈ మాసంలో పెళ్లి, గృహప్రవేశాల వంటి శుభకార్యాలకు భక్తులు దూరంగా ఉంటారు.
Similar News
News September 17, 2025
విశాఖలో గూగుల్ డేటా సెంటర్: సీఎం చంద్రబాబు

AP: విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని, త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో జరుగుతోన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. ‘విశాఖలో అద్భుతమైన వాతావరణం ఉంది. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి. మహిళల భద్రతలో అగ్రస్థానంలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ భారత్కు అతిపెద్ద ఆస్తి అని కొనియాడారు. దేశానికి ఆయనే సరైన నాయకుడని పేర్కొన్నారు.
News September 17, 2025
EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు: EC

ఈవీఎంలపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయంలో మెషీన్లపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంచనున్నట్లు తెలిపింది. బిహార్ ఎన్నికల నుంచి ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులను మరింత సులభంగా ఎన్నుకోవచ్చు. ఈవీఎం ప్యానెల్లో క్రమసంఖ్య, అభ్యర్థి పేరు, కలర్ ఫొటో, గుర్తు వరుసగా ఉంటాయి. ఇప్పటివరకు అభ్యర్థుల పేర్లు, పక్కన వారి సింబల్స్ ఉండేవి.
News September 17, 2025
ఆర్టీసీలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,000 డ్రైవర్, 743 శ్రామిక్(మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్, ఆటో ఎలక్ట్రిషియన్, పెయింటర్, వెల్డర్, అప్ హోల్స్టర్, మిల్రైట్ మెకానిక్) పోస్టులకు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మరిన్ని వివరాలకు ఇక్కడ <