News May 20, 2024
‘రామాయణ’ రెండు కాదు.. 3 పార్టులు!
సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్ నటిస్తున్న ‘రామాయణ’ 2 పార్టులు కాదు.. 3 పార్టులుగా రానుందట. ఈమేరకు చిత్రయూనిట్ నుంచి విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు టైమ్స్ నౌ పేర్కొంది. మొదటి భాగంలో సీతారాముల కళ్యాణం, రెండో పార్టులో సీతాపహరణం, మూడో పార్టులో సీతను తీసుకురావడం చూపించనున్నట్లు తెలిపింది. మూడు భాగాలను డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కించనున్నారు.
Similar News
News December 24, 2024
సీఎం రేవంత్ దావోస్ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి జనవరి 20 నుంచి 24 వరకు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అక్కడ జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ టూర్‌కు వెళ్తారు.
News December 24, 2024
యశస్వీ జైస్వాల్ ఆ తప్పు చేస్తున్నారు: పుజారా
భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ క్రీజులో ఫాస్ట్‌గా ఆడాలని కంగారు పడుతున్నారని క్రికెటర్ పుజారా అభిప్రాయపడ్డారు. తొలి 15 పరుగులు వేగంగా చేయాలనుకుని తప్పు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ వంటి దూకుడైన ఆటగాడు సైతం బంతి తన జోన్లో ఉన్నప్పుడే బలంగా బాదుతారు. కానీ జైస్వాల్ అనవసరమైన షాట్స్ ఆడుతున్నారు. బంతిని వద్దకు రానివ్వాలి. క్రీజులో ఎక్కువ సేపు నిలబడాలి’ అని సూచించారు.
News December 24, 2024
‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటన.. ఏ-18గా మైత్రీ మూవీ మేకర్స్
‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు మైత్రీ మూవీ మేకర్స్‌ను ఏ-18గా చేర్చారు. ఇప్పటికే హీరో అల్లు అర్జున్ను ఏ-11గా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్‌ఛార్జి, అల్లు అర్జున్ బౌన్సర్లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.