News March 1, 2025
సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న రంభ

సీనియర్ హీరోయిన్ రంభ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ప్రకటించారు. ‘సినిమానే నా ఫస్ట్ లవ్. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు, ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నా’ అని తెలిపారు. 90ల్లో హీరోయిన్‌గా, ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్‌లో నటించిన ఆమె 2010లో ఇంద్రకుమార్ అనే వ్యాపారిని వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు.
Similar News
News March 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 2, 2025
శుభ ముహూర్తం (02-03-2025)

☛ తిథి: శుక్ల తదియ, రా.12.52 వరకు
☛ నక్షత్రం: ఉత్తరాభాద్ర, మ.12.17 వరకు
☛ శుభ సమయం: ఉ.7.58 నుంచి 8.34 వరకు, మ.2.22 నుంచి 2.34 గంటల వరకు
☛ రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
☛ యమగండం: మ.12.00 నుంచి 1.30 వరకు
☛ దుర్ముహూర్తం: సా.4.25-నుంచి 5.13 వరకు
☛ వర్జ్యం: రా.11.29 నుంచి 12.59 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.7.48 గంటల నుంచి 9.17 వరకు
News March 2, 2025
రూట్‌ను ఫాలోకండి.. బజ్‌బాల్‌ను కాదు: కైఫ్

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే వైదొలగడంపై భారత మాజీ క్రికెటర్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని ఫార్మాట్లలో బజ్‌బాల్‌ను గుడ్డిగా ఫాలో అవ్వొద్దు. “వన్ నేషన్, వన్ స్టైల్” పనిచేయదు. సక్సెస్‌ఫుల్ టీమ్స్ పరిస్థితులకు తగ్గట్లు అడ్జస్ట్ అవుతాయి. జో రూట్‌ను ఫాలో అవ్వండి.. బజ్‌బాల్‌ను కాదు’ అని ట్వీట్ చేశారు.