News February 11, 2025
రామ్మోహన్ నాయుడుకు ‘యువ వక్త’ పురస్కారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739290015876_653-normal-WIFI.webp)
AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అరుదైన గుర్తింపు లభించింది. పుణేలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ ఆయనకు ‘ఉత్తమ యువ వక్త ఆఫ్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్’ అవార్డును ప్రదానం చేసింది. అతి పిన్న వయస్సులో ఎంపీగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రామ్మోహన్ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారని నిర్వాహకులు కొనియాడారు. కాగా ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన తెలిపారు.
Similar News
News February 12, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739294644471_893-normal-WIFI.webp)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 12, 2025
శుభ ముహూర్తం (12-02-2025)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739292760480_893-normal-WIFI.webp)
✒ తిథి: పూర్ణిమ రా.7.08 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష రా.7.35 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
✒ యమగండం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: ఉ.8.03 నుంచి ఉ.9.41 వరకు
✒ అమృత ఘడియలు: సా.5.55 నుంచి సా.7.35 వరకు
News February 12, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739298424228_893-normal-WIFI.webp)
ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా వెన్నునొప్పి కారణంగా దూరమయ్యారని BCCI ప్రకటించింది. ఆయన స్థానంలో హర్షిత్ రానాను, జైస్వాల్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని సెలక్ట్ చేసింది. జైస్వాల్, సిరాజ్, దుబే నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్గా ఉంటారని, అవసరమైనప్పుడు దుబాయ్ వెళతారని పేర్కొంది.
TEAM: రోహిత్, కోహ్లీ, గిల్, పంత్, రాహుల్, శ్రేయస్, హార్దిక్, అక్షర్, సుందర్, కుల్దీప్, జడేజా, హర్షిత్, షమీ, అర్ష్దీప్, వరుణ్.