News June 15, 2024
రామోజీరావు విగ్రహం చేయిస్తున్న TDP ఎంపీ

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు విగ్రహం రూపుదిద్దుకుంటోంది. విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు (గతంలో ఈనాడు రిపోర్టర్) కోరికతో విగ్రహం తయారుచేస్తున్నట్లు కోనసీమ జిల్లా కొత్తపేటలోని ప్రముఖ శిల్పి రాజకుమార్ వుడయార్ తెలిపారు. రామోజీరావు గురించి భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ‘ఈనాడు’ ప్రారంభమైన విశాఖపట్నంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని అప్పలనాయుడు చెప్పారు.
Similar News
News December 2, 2025
కృష్ణా: పోస్టాఫీసులో భారీ మోసం

ఉంగుటూరు పోస్టాఫీసులో నకిలీ స్టాంపులు, పాస్బుక్స్తో రూ.2 కోట్లకు పైగా ఖాతాదారుల డిపాజిట్లు మాయమైన ఘటన బయటపడింది. పోస్టుమాస్టర్ దేవేంద్రరావు, పోస్టుమాన్ శేఖర్ కలిసి ఏడాదిగా FDలు, సేవింగ్స్ రికార్డుల్లో భారీ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. సోమవారం ఓ మహిళ FD తీసుకోడానికి రాగా అసలు విషయం తెలిసింది. ఖాతాదారులు విచారణ కోరగా, అధికారలు పోస్టుమాస్టర్ను సస్పెండ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణాహారం అందకపోతే జరిగేది ఇదే

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
News December 2, 2025
IPLకు మరో స్టార్ ప్లేయర్ దూరం!

ఐపీఎల్-2026కు మరో స్టార్ ప్లేయర్ దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరిగే మినీ వేలం కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ రిజిస్టర్ చేసుకోలేదని సమాచారం. గత సీజన్లో మ్యాక్సీ పంజాబ్ తరఫున ఆడగా తిరిగి రిటైన్ చేసుకోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వచ్చే సీజన్ ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే డుప్లెసిస్, రసెల్ వంటి స్టార్లు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


