News June 8, 2024
రామోజీరావు.. మీడియా మొఘల్

<<13400528>>రామోజీరావు<<>> 1974 AUG 10న నక్కవానిపాలెం(విశాఖ)లో ‘ఈనాడు’ తొలి ఆఫీస్‌ను ప్రారంభించారు. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులకు పునాది వేశారు. 1995లో ETV ఛానల్‌ను ప్రారంభించి ‘ఈటీవీ.. మీటీవీ’ స్లోగన్‌తో ప్రతి ఇంట వినోదాన్ని పంచారు. 2003లో ETV-2 పేరిట తెలుగు రాష్ట్రాల్లో తొలి 24 గంటల వార్తా ఛానల్‌ను తీసుకొచ్చారు. దీన్ని 2014లో ETV AP, TGగా మార్చారు.
Similar News
News September 10, 2025
చంద్రగ్రహణానికి నలుగురు PMలు బలి: గోయెంకా

వివిధ దేశాల ప్రధానులు పదవులు కోల్పోవడంపై పారిశ్రామికవేత్త గోయెంకా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘చంద్రగ్రహణం ఎఫెక్ట్‌తో రెండు రోజుల వ్యవధిలో జపాన్, ఫ్రాన్స్, నేపాల్, థాయిలాండ్ PMలు బలయ్యారు. ఇప్పుడు అందరి చూపు సూర్య గ్రహణంపై పడింది. తర్వాత బలయ్యేది ఓ పెద్ద ‘ఆరెంజ్ టింటెడ్’ లీడర్ కావొచ్చు’’ అంటూ జోస్యం చెప్పారు. దీంతో ఆ లీడర్ ఆరెంజ్ కలర్ హెయిర్‌తో ఉండే ట్రంపేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News September 10, 2025
57 పరుగులకే UAE ఆలౌట్

టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచులో యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటారు. శివమ్ దూబే 3, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. యూఏఈ బ్యాటర్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 22 మాత్రమే. మరి భారత్ ఎన్ని ఓవర్లలో ఈ టార్గెట్ ఛేదిస్తుందో కామెంట్ చేయండి.
News September 10, 2025
ఖతర్‌పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ

ఖతర్ రాజధాని దోహాపై నిన్న ఇజ్రాయెల్ చేసిన <<17661181>>అటాక్‌ను<<>> PM మోదీ ఖండించారు. ‘ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్‌తో మాట్లాడాను. సోదర దేశమైన ఖతర్ సార్వభౌమాధికారంపై దాడిని భారత్ ఖండిస్తోంది. ఘర్షణలకు తావులేకుండా చర్చలు, దౌత్యపరంగా సమస్యల పరిష్కారానికి మద్దతిస్తాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఖతర్‌లో శాంతి, స్థిరత్వానికి ఇండియా అండగా నిలబడుతుంది’ అని ట్వీట్ చేశారు. అయితే ఇజ్రాయెల్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.