News June 27, 2024

రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి: CM చంద్రబాబు

image

AP: NTR, రామోజీరావు యుగపురుషులని CM చంద్రబాబు కొనియాడారు. ‘ఎప్పటినుంచో NTRకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రామోజీరావుకు కూడా భారతరత్న వచ్చేలా కృషి చేద్దాం. రాజధానికి అమరావతి పేరును ఆయనే సూచించారు. అందుకే అక్కడ ఆయన పేరిట విజ్ఞాన్ భవన్ నిర్మిస్తాం. ఓ రోడ్డుకు రామోజీ పేరు పెడతాం. విశాఖలో రామోజీ పేరిట చిత్రనగరి, NTR ఘాట్ మాదిరి మెమోరియల్ నిర్మిస్తాం’ అని సంస్మరణ సభలో ప్రకటించారు.

Similar News

News September 19, 2024

AP: స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పుడంటే?

image

తెలంగాణలో స్కూళ్లకు దసరా <<14141736>>సెలవులు <<>>ప్రకటించడంతో ఏపీలో ఎప్పట్నుంచి ఉంటాయనే చర్చ మొదలైంది. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమై అక్టోబర్ 13తో ముగుస్తాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతికి సెలవు కాగా.. 3వ తేదీన వర్కింగ్ డేగా ఉండనుంది. ఇటీవల వర్షాలతో పలు జిల్లాల్లో 5-6 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ఇవ్వడంతో దసరా హాలిడేస్ తగ్గించే అవకాశం ఉందని సమాచారం.

News September 19, 2024

లడ్డూ విషయంలో దేవుడు క్షమించడు: బండి

image

లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం అంటే తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడమేనని కేంద్రమంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. హిందువులకు జరిగిన ఈ ద్రోహాన్ని దేవుడు క్షమించడని అన్నారు. ఈ లడ్డూ వ్యవహారంలో AP ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

News September 19, 2024

జానీ మాస్టర్ దేశం కోసం ప్రాణాలైనా ఇస్తారు: భార్య సుమలత

image

TG: తన భర్త జానీ మాస్టర్‌పై వస్తున్న అత్యాచార ఆరోపణలు అవాస్తవమని ఆయన భార్య సుమలత అన్నారు. ఆయనపై కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ‘లవ్ జిహాదీ అని ఏదేదో అంటున్నారు. నా భర్త అలాంటి వ్యక్తి కాదు. ఆరోపణలు రుజువైతే జానీని వదిలేసి వెళ్తా. ఆ అమ్మాయికి చాలామందితో అఫైర్ ఉంది. అవార్డ్ వచ్చినప్పటి నుంచి కావాలనే జానీని టార్గెట్ చేశారు. దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తి నా భర్త.’ అని ఆమె పేర్కొన్నారు.