News April 10, 2025
ఇండియాకు రాణా.. NIA స్టేట్‌మెంట్ రిలీజ్

ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. పలు కేంద్ర సంస్థల సహకారంతో రాణాను విజయవంతంగా ఇండియాకు రప్పించామని పేర్కొంది. ‘భారత్-అమెరికా ఒప్పందంతో తహవూర్ రాణాను తీసుకువచ్చాం. పలు ఉగ్ర సంస్థలతో కలిసి ముంబై ఉగ్రదాడికి రాణా కుట్ర చేశాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో అతడు చేతులు కలిపాడు. ముంబై మారణహోమంలో 166 మంది చనిపోయారు’ అని తెలిపింది.
Similar News
News February 13, 2026
రాహుల్‌పై నోటీసు… స్పీకర్ నిర్ణయంపై ఆసక్తి

రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని BJP MP నిశికాంత్ దూబే సబ్‌స్టాంటివ్ మోషన్ నోటీసు ఇవ్వడం తెలిసిందే. దీనిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. దీన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించడంపై స్పీకర్ నిర్ణయించాలి. అది విచారించి ఇచ్చిన సిఫార్సును సభ ఆమోదానికి పెట్టాలి. సభ సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చర్య చేపడతారు. గతంలో మొహువా మొయిత్రా (TMC MP)ని ఎథిక్స్ కమిటీ సిఫార్సుతో బహిష్కరించారు.
News February 13, 2026
మార్కెట్ల పతనం.. ₹7 లక్షల కోట్లు ఉఫ్!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బేర్ గుప్పిట్లో చిక్కుకొని విలవిల్లాడాయి. సెన్సెక్స్ 1,048 Pts కుంగి 82,626 వద్ద, నిఫ్టీ 336 Pts క్షీణించి 25,471 దగ్గర స్థిరపడ్డాయి. సెన్సెక్స్-30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, SBI మాత్రమే లాభపడ్డాయి. HUL, ఎటర్నల్, TATA స్టీల్, టైటాన్ భారీగా నష్టపోయాయి. దాదాపు ₹7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఐటీ స్టాక్స్ డౌన్‌ఫాల్ మార్కెట్ల పతనాన్ని శాసించింది.
News February 13, 2026
విశ్వక్ సేన్ ‘funky’ రివ్యూ&రేటింగ్

దర్శకుడు కావాలనుకున్న ఓ యువకుడు ఏ ఇబ్బందులు పడ్డాడు, ఎలా అధిగమించాడనేదే కథ. డైరెక్టర్ అనుదీప్ సింగిల్ లైనర్స్ కామెడీ ఫస్టాఫ్‌లో కొన్నిచోట్ల ఆకట్టుకుంటుంది. మిగతావి రిపీట్, ఔట్‌డేటెడ్ అన్పిస్తాయి. ఇక కథలో లాజిక్, ఎమోషన్ మిస్ కావడం మైనస్. భీమ్స్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ఎడిటింగ్ మరో మైనస్. విశ్వక్ సేన్, కయాదు లోహర్ నటన బాగున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఫర్వాలేదు.
రేటింగ్: 2/5


