News March 20, 2024
మరోసారి హోస్ట్‌గా అలరించనున్న రానా

హీరో రానా మరో సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయ్యారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే ఈ షోకు ‘ది రానా కనెక్షన్’ అనే పేరుని ఖరారు చేశారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి ప్రసారం చేస్తారనేది రివీల్ చేయలేదు. టాలీవుడ్, బాలీవుడ్‌తో సహా పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలను ఈ షోకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. గతంలో రానా ‘నంబర్ 1 యారీ’ పేరుతో ఓ టీవీ షోకు హోస్ట్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Similar News
News April 11, 2025
చైనాపై 145శాతానికి చేరిన అమెరికా సుంకాలు

చైనాపై అమెరికా విధించిన మొత్తం సుంకాలు 145 శాతానికి చేరాయి. వాస్తవంగా టారిఫ్‌ల పర్సంటేజీ 125 శాతానికి చేరింది. అయితే గతంలో ఫెంటానిల్ అక్రమ రవాణా కాకుండా విధించిన 20 శాతాన్ని అమెరికా తాజాగా గుర్తుచేసింది. దానితో కలిపి మొత్తం టారిఫ్‌లు 145శాతానికి చేరుకున్నాయని ట్రంప్ యంత్రాంగం వివరించింది. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84శాతం సుంకాల్ని విధించిన సంగతి తెలిసిందే.
News April 11, 2025
కెప్టెన్సీకి ధోనీ ఏమాత్రం సంకోచించలేదు: ఫ్లెమింగ్

చెన్నై టీమ్‌కు మరోసారి కెప్టెన్సీ చేసేందుకు ధోనీ ఏమాత్రం వెనుకంజ వేయలేదని ఆ జట్టు కోచ్ ఫ్లెమింగ్ వెల్లడించారు. ‘జట్టు పరిస్థితిని ఆయనకు చెప్పగానే వెంటనే అర్థం చేసుకున్నారు. రుతు గాయపడిన నేపథ్యంలో తన స్థానంలో కెప్టెన్సీ చేయాలని కోరగానే ఏమాత్రం సంకోచించకుండా సరే అన్నారు’ అని పేర్కొన్నారు. మోచేతి గాయం కారణంగా ప్రస్తుత <<16058968>>కెప్టెన్ రుతురాజ్ సీజన్ మొత్తానికి<<>> దూరమైన సంగతి తెలిసిందే.
News April 11, 2025
విషాదం: NIT విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ జిల్లాలోని NITలో విషాదం చోటుచేసుకుంది. సంస్థలో బీటెక్ సెకండియర్ చదువుతున్న హృతిక్ సాయి అనే విద్యార్థి స్థానిక వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయనే ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి స్వస్థలం హైదరాబాద్ కాగా ఎన్ఐటీ హాస్టల్లోనే నివాసముంటున్నాడని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.