News November 13, 2024
రానా సరికొత్త షో!

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ షోలు చేస్తూ హీరో రానా బిజీగా గడుపుతున్నారు. తాజాగా ‘ది రానా దగ్గుబాటి షో’ అనే పేరుతో సరికొత్త ప్రోగ్రామ్‌తో ముందుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 23వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నటీనటులకు సంబంధించి మనకు తెలియని స్టోరీలను ఇందులో తెలియజేస్తారని రానా ట్వీట్ చేశారు. గతంలో ఆయన చేసిన ‘మెక్‌డోవెల్ నంబర్ 1 యారీ’ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News November 12, 2025
ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు: చంద్రబాబు

AP: మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తామని CM చంద్రబాబు అన్నారు. ఇమామ్, మౌజమ్‌లకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లిస్తామని చెప్పారు. ప్రతి మసీదుకు త్వరలోనే నెలకు రూ.5వేలు ఇస్తామన్నారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేసినా మైనారిటీల ద్వారానే ఆస్తుల సంరక్షణ చేస్తామని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేసి అందరూ పరిశీలించేలా చేస్తామన్నారు.
News November 12, 2025
సొంత గడ్డపై భారత్‌దే ఆధిపత్యం

టీమ్ఇండియాపై టెస్టుల్లో దక్షిణాఫ్రికాదే పైచేయి. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 44 టెస్టులు జరగగా సఫారీ టీమ్ 18, భారత్ 16 విజయాలు సాధించాయి. మరో 10 మ్యాచులు డ్రాగా ముగిశాయి. అయితే సొంత గడ్డపై 19 మ్యాచులు ఆడగా టీమ్ ఇండియా 11, దక్షిణాఫ్రికా ఐదింట్లో విజయం సాధించాయి. 3 టెస్టులు డ్రా అయ్యాయి. SA 2008లో చివరగా భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. ఈ నెల 14న ఇరు జట్ల మధ్య కోల్‌కతాలో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
News November 12, 2025
రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు

AP: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. అన్నమయ్యలోని దేవగుడి పల్లి నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్‌గా వీటిని ప్రారంభిస్తారు. పీఎం ఆవాస్ యోజన కింద 2,28,034 లక్షలు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292, PMAY జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.


