News October 17, 2024
‘స్పిరిట్’లో రణ్‌బీర్, విజయ్ దేవరకొండ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రణ్‌బీర్ కపూర్లు నటిస్తారని ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అలాగే ఓ స్టార్ హీరోను ఈ చిత్రంలో విలన్‌గా తీసుకోవాలని సందీప్ ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఈ మూవీలో రెబల్ స్టార్ డ్యుయెల్ రోల్ పోషించనున్నట్లు సమాచారం.
Similar News
News January 3, 2025
అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ?
ఖలిస్థానీ వేర్పాటువాది, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న పంజాబ్‌లోని శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అజ్నాలా పీఎస్‌పై దాడి కేసులో అరెస్టైన అమృత్ పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. గత ఎన్నికల్లో జైలు నుంచే ఆయన పోటీ చేసి ఖడూర్ సాహిబ్ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.
News January 3, 2025
స్టాలిన్ సినిమా డైలాగ్‌తో మస్క్ స్టేట్మెంట్ సింక్ అవుతోందట!
స్టాలిన్ సినిమాలో నువ్వు చేయి నరకడం తప్పు కాదు, కానీ నరికిన చోటు తప్పు అని చిరంజీవిని ప్రకాశ్‌రాజ్ వారిస్తారు. అలాగే లాస్ వెగాస్‌లో టెస్లా సైబర్‌ట్రక్‌ను ముష్కరులు పేల్చేశారు. దీంతో నిందితులు కారును తప్పుగా ఎంచుకున్నారని <<15044521>>మస్క్<<>> అన్నారు. అయితే నువ్వు బాంబు పేల్చడం తప్పు కాదు, దాని కోసం సైబర్‌ట్రక్‌ను ఉపయోగించడమే తప్పు అన్నట్టుగా మస్క్ స్టేట్మెంట్ ఉందని కామెంట్లు పేలుతున్నాయి.
News January 3, 2025
సిరియా మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం?
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆయన తీవ్రంగా జబ్బు పడ్డారని, భద్రతాసిబ్బంది అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. విషప్రయోగం జరిగినట్లు వైద్యులు గుర్తించారని పేర్కొన్నాయి. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించాయి.