News May 25, 2024

తగ్గనున్న రేంజ్ రోవర్ ధరలు!

image

భారత్‌లో టాటా మోటార్స్‌కు చెందిన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ల ధరలు త్వరలో తగ్గనున్నాయి. దేశంలో వీటి ఉత్పత్తిని ప్రారంభించడమే ఇందుకు కారణం. సంస్థ 54 ఏళ్ల చరిత్రలో బ్రిటన్ వెలుపల తొలిసారిగా వీటిని తయారు చేయడం విశేషం. స్థానికంగా ఉత్పత్తి చేయడంతో వీటి ధరలు 18-22% తగ్గనున్నాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రూ.1.9 కోట్ల నుంచి 1.4 కోట్లకు, రేంజ్ రోవర్ రూ.3.3కోట్ల నుంచి రూ.2.6 కోట్లకు తగ్గనుంది.

Similar News

News December 25, 2025

‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను ప్రారంభించిన మోదీ.. ఏంటిది?

image

లక్నోలో(UP) ₹230 కోట్లతో, 65 ఎకరాల్లో నిర్మించిన ‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. వారి గొప్ప ఆలోచనలు, సుపరిపాలన పాఠాలను ముందు తరాలకు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని ప్రధాని వివరించారు. దేశ సేవ, నాయకత్వ విలువలు, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించే వేదికగా ఈ కేంద్రం నిలుస్తుందన్నారు.

News December 25, 2025

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

image

బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. రాజ్‌బరి జిల్లాలో 29 ఏళ్ల యువకుడు అమృత్ మండల్‌ను కొట్టి చంపారు. బుధవారం రాత్రి 11 గం.కు రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి దారుణంగా దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అమృత్ దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఈ హింసకు తెగబడ్డారు. కాగా ఇటీవల <<18624742>>దీపూ చంద్రదాస్<<>> అనే హిందూ యువకుడిని కొందరు కొట్టి చంపి, తగలబెట్టిన విషయం తెలిసిందే.

News December 25, 2025

‘అతను అంతమైపోవాలి’.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

image

రష్యాతో యుద్ధంపై విసిగిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ క్రిస్మస్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అందరిదీ ఒకే కోరిక.. అతను అంతమైపోవాలి’ అంటూ పరోక్షంగా పుతిన్ మరణాన్ని కోరుకున్నారు. రష్యా వెనక్కి తగ్గితే తూర్పు ఉక్రెయిన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని జెలెన్‌స్కీ అన్నారు. ఆ ప్రాంతం అంతర్జాతీయ దళాల పర్యవేక్షణలో ఉండాలని కోరారు. ఏదైనా పీస్ డీల్ వస్తే ప్రజాభిప్రాయం తీసుకుంటానన్నారు.