News September 18, 2024
SECగా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్గా గోపాల్

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కమిషనర్గా రిటైర్డ్ IAS రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా విశ్రాంత IAS ఎంజీ గోపాల్ను నియమించింది. ఇద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగనున్నారు. రాణి కుముదిని 1988 IAS బ్యాచ్ కాగా గోపాల్ 1983 IAS బ్యాచ్. వీరిద్దరూ కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా పనిచేశారు.
Similar News
News January 1, 2026
సౌదీలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష

సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు రికార్డు స్థాయికి చేరింది. 2025లో ఏకంగా 356 మందికి మరణ దండన అమలు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్ రవాణాపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం శిక్షల్లో 243 డ్రగ్స్ కేసులే కావడం గమనార్హం. ఓవైపు పర్యాటకం, క్రీడలతో ఆధునిక దేశంగా ఎదగాలని యత్నిస్తున్న సౌదీ, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
News January 1, 2026
అంచనాకు మించి అయ్యప్ప బంగారం చోరీ: SIT

శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ అంచనా కంటే ఎక్కువే అని కొల్లాం కోర్టుకు SIT తెలిపింది. సన్నిధానం తలుపులకు గల ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్, ద్వారపాలక విగ్రహాలు సహా 7ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్టు సమర్పించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక 4.5KGల మేర బంగారాన్ని రికార్డుల్లో రాగి అని మార్చాడని పేర్కొంది. చెన్నైలో కెమికల్స్తో బంగారం కరిగించారని తెలిపింది.
News January 1, 2026
శిక్ష పూర్తయినా వదలని పాక్.. జైళ్లలోనే 167 మంది భారతీయులు!

భారత్-పాక్ మధ్య ఏటా జరిగే ఖైదీల జాబితా మార్పిడి ప్రక్రియ 2026 నూతన సంవత్సరం తొలి రోజైన గురువారం పూర్తయింది. ఆ దేశ జైళ్లలో శిక్షాకాలం పూర్తయినప్పటికీ ఇంకా 167 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలు అక్కడే మగ్గుతున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వీరిని వెంటనే విడుదల చేయాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం పాక్ కస్టడీలో మొత్తం 257 మంది ఉండగా.. భారత జైళ్లలో 424 మంది పాకిస్థానీలు ఉన్నారు.


