News November 24, 2024
రాణించిన రాహుల్.. అతియా పోస్ట్ వైరల్
కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతం అవుతున్న కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు 77 రన్స్ చేశారు. దీంతో రాహుల్ భార్య అతియా శెట్టి ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ వైరల్ అవుతోంది. ‘ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోడు.. వెనక్కి తగ్గడు’ అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. కాగా రాహుల్, అతియా త్వరలోనే పేరెంట్స్ కానున్నారు. వచ్చే ఏడాది తాము బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఇటీవల వారు ప్రకటించారు.
Similar News
News November 24, 2024
మిచెల్ స్టార్క్‌కు రూ.11.75 కోట్లు
పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. గత వేలంలో ఇతణ్ని ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర రూ.24.75కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పవర్ ప్లే, డెత్ ఓవర్లలోనూ స్టార్క్ స్పెషలిస్ట్ బౌలర్.
News November 24, 2024
ఆర్థిక రాజధానిలో Political Stability.. మార్కెట్లకు బూస్ట్!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రాజకీయ సుస్థిరత స్టాక్ మార్కెట్లకు పెద్ద బూస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. మహాయుతి 233 స్థానాల్లో ఘన విజయం సాధించడంతో మార్కెట్లు సోమవారం పాజిటివ్‌గా ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి రంగాలకు ప్రయోజనమని చెబుతున్నారు. ఈ ఫలితాల పాజిటివ్ సెంటిమెంట్ Market Dynamicsని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
News November 24, 2024
జోస్ బట్లర్‌ను సొంతం చేసుకున్న GT
ఓపెనింగ్ బ్యాటర్, కీపర్ జోస్ బట్లర్‌ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ (GT) సొంతం చేసుకుంది. ఇతని బేస్ ప్రైజ్ రూ.2కోట్లు కాగా, 2024 ఐపీఎల్ సీజన్‌లో బట్లర్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనింగ్ చేశారు. హార్డ్ హిట్టింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలరు. బట్లర్ కోసం గుజరాత్, లక్నో జట్లు పోటీ పడ్డాయి.