News October 16, 2025

రంజీ ట్రోఫీ.. 40 ఏళ్ల వయసులో రికార్డు

image

రంజీ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా J&K కెప్టెన్ పరాస్ డోగ్రా(40 ఏళ్లు) నిలిచారు. ముంబైతో మ్యాచులో ఆయన 32వ సెంచరీ నమోదు చేశారు. 42 సెంచరీలతో మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే రంజీల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో జాఫర్ (12,038) తర్వాత డోగ్రా(9,500) రెండో స్థానంలో ఉన్నారు. 2001-02లో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన డోగ్రా గతంలో HP, పుదుచ్చేరి జట్లకు ఆడారు.

Similar News

News October 17, 2025

కావేరి నదీ ఎలా పుట్టిందంటే?

image

పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుని కుమార్తె అయిన కావేరిని, కావేర ముని దత్తత తీసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న అగస్త్య మహాముని, దైవ చర్చలలో మునిగి, ఆమెను నిర్లక్ష్యం చేశాడు. దీంతో అసహనానికి గురైన ఆమె అగస్త్య ముని స్నానపు తొట్టిలో పడిపోయింది. అనంతరం కావేరి నదిగా జన్మించింది. ప్రజలకు మేలు చేయాలనే తన లక్ష్యాన్ని కావేరి ఇలా నేరవేర్చుకుంది. కార్తీక మాసంలో ఈ నదిలో స్నానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.

News October 17, 2025

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6 పోస్టులకు అప్లై చేయడానికి రేపటి వరకు అవకాశం ఉంది. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, B.Ed ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, వాచ్‌మెన్ కమ్ గార్డనర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 22-40ఏళ్ల మధ్య ఉండాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in/

News October 17, 2025

ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయ్: IMD

image

దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని IMD వెల్లడించింది. దీంతో ఏపీ, TN, కేరళ, పుదుచ్చేరి, కరైకల్, కర్ణాటక, కేరళ, మాహే వాతావరణ సబ్‌డివిజన్లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే AP, తమిళనాడు, కేరళల్లో 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రేపటిలోపు అల్పపీడనంగా ఏర్పడి, 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందంది.