News March 26, 2024
పాక్ హెడ్ కోచ్‌గా రాంకీ?

పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు ల్యూక్ రాంకీ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. PCB ఇప్పటికే అతడితో సంప్రదింపులు జరిపింది. కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రాంకీ కూడా సిద్ధంగా ఉన్నట్లు టాక్. కాగా 42 ఏళ్ల రాంకీకి పాకిస్థాన్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన PSLలో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2018 సీజన్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచారు. ఆ సీజన్ ఫైనల్లోనూ POTM అవార్డు అందుకున్నారు.
Similar News
News January 31, 2026
మత మార్పిడి ఆరోపణ నిరూపిస్తే రాజీనామా: కౌశిక్ రెడ్డి

TG: కరీంనగర్ CP మతమార్పిడి చేస్తున్నట్లు తాననలేదని BRS MLA కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ‘TG IPS ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను అలా అన్నట్లు నిరూపిస్తే MLAగా రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దాన్ని నిరూపించకుంటే అసోసియేషన్ నాయకులు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో వారిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా’ అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
News January 31, 2026
ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 31, 2026
మొక్కజొన్నలో జింక్ లోపం – నివారణ

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మోతాదుకు మించి భాస్వరం ఎరువులను వాడినప్పుడు, అధిక నీటి ముంపునకు గురైనప్పుడు మొక్కజొన్నలో జింక్ లోపం కనబడుతుంది. దీని వల్ల ఆకుల, ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు, తెలుపు రంగుగా మారతాయి. పంట ఎదుగుదల ఆశించినంతగా ఉండదు. జింక్ లోపం నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి 4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


