News April 2, 2025
RTC ఉద్యోగుల పిల్లలకు ర్యాంకులు.. సజ్జనార్ సన్మానం

TG:గ్రూప్-1 ఫలితాల్లో ఉద్యోగాలు పొందిన TGSRTC ఉద్యోగుల పిల్లలను సంస్థ MD సజ్జనార్ సన్మానించారు. గ్రూప్-1 రిజల్ట్స్‌లో నారాయణపేట డిపోకు చెందిన కండక్టర్ శ్రీనివాస్ కుమార్తె వీణ 118వ ర్యాంక్, TI-2గా పనిచేస్తున్న వాహిద్ కుమార్తె ఫాహిమినా 126వ ర్యాంక్, వనపర్తి డిపోకు చెందిన కండక్టర్ పుష్పలత కుమారుడు రాఘవేందర్ 143వ ర్యాంకులు సాధించారు. RTC ఉద్యోగుల పిల్లలు రాణించడం చాలా సంతోషంగా ఉందని సజ్జనార్ అన్నారు.
Similar News
News April 3, 2025
APకి రండి.. ‘OPEN AI’ సీఈవోకు చంద్రబాబు ఆహ్వానం

AI వినియోగంలో భారత్ ప్రపంచాన్ని అధిగమిస్తుందని ‘OPEN AI’ సీఈవో సామ్ ఆల్ట్మాన్ చేసిన ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ‘AIని అందిపుచ్చుకోవడంలో భారతదేశం తన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ AI-ఆధారిత పురోగతికి కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉంది. ఇండియాకు వచ్చినప్పుడు అమరావతిని సందర్శించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీతో మా విజన్‌ను పంచుకుంటాం’ అని ట్వీట్లో రాసుకొచ్చారు.
News April 3, 2025
ఈనెల 18న ‘అర్జున్ S/O వైజయంతి’ రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోకు తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
News April 3, 2025
రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు

AP: విశాఖలో రామానాయుడు స్టూడియోకు కేటాయించిన 35 ఎకరాల్లో 15.17 ఎకరాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఓ ప్రయోజనం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని మిగతా వాటికోసం వినియోగిస్తే రద్దు చేయాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారం స్టూడియోకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా కలెక్టర్‌ను ఆదేశించారు.