News February 7, 2025
మంత్రులకు ర్యాంకులు.. వారికి అంబటి కంగ్రాట్స్
AP: ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన <<15380097>>ర్యాంకులపై<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘మంత్రివర్గపు ర్యాంకులలో 8, 9 స్థానాలను సాధించిన లోకేశ్, పవన్‌లకు అభినందనలు!’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు 10వ ర్యాంకు వచ్చిందని పలువురు కామెంట్స్ చేశారు. ప్రత్యేకంగా వీరిద్దరికే శుభాకాంక్షలు చెప్పడం వెనుక వ్యంగ్యం ఉందని పేర్కొంటున్నారు.
Similar News
News February 7, 2025
English Learning: Antonyms
✒ Immense× Puny, Insignificant
✒ Immaculate× Defiled, Tarnished
✒ Imminent× Distant, Receding
✒ Immerse× Emerge, uncover
✒ Impair× Restore, Revive
✒ Immunity× Blame, Censure
✒ Impediment× Assistant, Concurrence
✒ Impartial× Prejudiced, Biased
✒ Impute× Exculpate, support
News February 7, 2025
క్రీడాకారులకు రూ.7.96 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల
AP: రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 189 మందికి రూ.7.96 కోట్ల ప్రోత్సాహాలను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం 224 మందికి రూ.11.68 కోట్ల ఇన్‌సెంటీవ్‌లను పెండింగ్‌లో పెట్టిందని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో రూ.7.96 కోట్లను రిలీజ్ చేశారని తెలిపారు.
News February 7, 2025
కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ సెటైర్లు
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెటైర్లు వేశారు. ‘జనవరిలో మెడ నొప్పి.. ఫిబ్రవరిలో మోకాలు నొప్పి.. ఇదేం ఫిట్‌నెస్.. ఏదైతేనేం కటక్ మ్యాచ్ నాటికి కోహ్లీ పూర్తిగా కోలుకోవాలి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో మోకాలి గాయం కారణంగా కోహ్లీ బరిలోకి దిగని విషయం తెలిసిందే. ఆయన స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడారు.