News February 7, 2025
మంత్రులకు ర్యాంకులు.. సీఎం ఏమన్నారంటే?

AP: మంత్రుల ర్యాంకులపై విమర్శల నేపథ్యంలో CM చంద్రబాబు స్పందించారు. ‘ప్రజలకు సుపరిపాలన అందించాలంటే ప్రభుత్వంలోని ప్రతిఒక్కరూ కష్టపడాలి. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. అంతేకానీ ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. నేను కూడా నా స్థానాన్ని మెరుగుపరుచుకోవాల్సి ఉంది. అందరూ సానుకూల దృక్పథంతో అన్ని శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నా’ అంటూ CBN ట్వీట్ చేశారు.
Similar News
News December 4, 2025
కొయ్యలగూడెం RWS కార్యాలయంపై ACB దాడులు

కొయ్యలగూడెం ఆర్డబ్ల్యూఎస్ (RWS-రూరల్ వాటర్ సప్లై) కార్యాలయంలో ACB అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఓ కాంట్రాక్టర్ నుండి భారీ మొత్తంలో నగదు లంచం తీసుకుంటుండగా RWS శాఖకు చెందిన ఇరువురు అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 4, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్ను ఆపుకోవడం, బాత్రూమ్లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.
News December 4, 2025
మలబద్ధకాన్ని నివారించాలంటే?

* టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. రోజూ ఒకే సమయాన్ని అనుసరించాలి.
* సాధ్యమైనంత వరకు ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించండి. వాటిని వాడటంలో సమస్యలుంటే వెస్ట్రన్ టాయిలెట్ల ముందు పీఠను ఉపయోగించి మోకాళ్లను కాస్త పైకి ఉంచుకోవాలి. ఇది మల మార్గాన్ని సులభతరం చేస్తుంది.
* 5-10 ని.ల కంటే ఎక్కువ సేపు బాత్రూమ్లో ఉండొద్దు.
* ఫుడ్లో తగినంత ఫైబర్, సరిపడినన్ని నీళ్లు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి.


