News March 3, 2025

దేవర-2లో రణ్‌వీర్ సింగ్?

image

జూ.ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సూపర్ హిట్ కావడంతో పార్ట్-2పై డైరెక్టర్ కొరటాల శివ కసరత్తు చేస్తున్నారు. ముందు అనుకున్న కథలో చాలా మార్పులు చేసి కొత్త స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేపై ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కోసం ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేసినట్లు టాక్. త్వరలోనే ఆయనకు కథను వినిపిస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా 2026 జనవరిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Similar News

News November 26, 2025

iBOMMA రవి కేసులో ట్విస్ట్.. పైరసీ చేయకుండా..!

image

iBOMMA రవి నేరుగా సినిమాలు పైరసీ చేయలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసేవాడని తెలిపారు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఆ సినిమాలను టెక్నాలజీ సాయంతో HD క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం సైట్లలో పోస్ట్ చేసేవాడని చెప్పారు. అయితే గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.

News November 26, 2025

Official: అహ్మదాబాద్‌లో కామన్ వెల్త్ గేమ్స్

image

2030 కామన్‌వెల్త్ గేమ్స్‌ ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్‌ అధికారికంగా ఖరారైంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నిర్వహించిన కామన్‌వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో 15-17 క్రీడలు ఉండనున్నాయి. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే గేమ్స్‌లో మాత్రం 10 స్పోర్ట్స్ ఉండనున్నాయి. కాగా 2030లో జరగబోయేవి శతాబ్ది గేమ్స్ కావడం గమనార్హం.

News November 26, 2025

₹7,280 కోట్లతో రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌ పథకం

image

రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌ ఎగుమతులపై చైనా ఆంక్షల నేపథ్యంలో కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఏటా 6K మెట్రిక్ టన్నుల సామర్థ్యమే లక్ష్యంగా ₹7,280 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. గ్లోబల్ బిడ్డింగ్‌తో 5 సంస్థలను ఎంపిక చేస్తామని, ఒక్కో సంస్థకు 1,200 MTPA సామర్థ్యం నిర్దేశిస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.