News July 3, 2024
’కల్కి‘లో దీపిక నటనపై రణ్‌వీర్ సింగ్ ప్రశంసలు

కల్కి సినిమాలో తన భార్య దీపికా పదుకొణె అత్యద్భుతంగా నటించారని బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రశంసించారు. భారతీయ సినిమాలో కల్కి ఉత్తమ చిత్రమని ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చారు. నిన్న రాత్రి కుటుంబసభ్యులతో కలిసి రణ్‌వీర్ సినిమా చూశారు. ప్రభాస్, కమల్ హాసన్ నటనతో అదరగొట్టారని, తన లాంటి అమితాబ్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని తప్పక చూడాలని పేర్కొన్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
Similar News
News April 4, 2026
పశ్చిమాసియా యుద్ధం.. నిర్మాణ రంగంపై భారం

పశ్చిమాసియా యుద్ధం దేశంలో నిర్మాణ రంగంపై పడింది. రంగులు, స్టీల్, సిమెంట్, టైల్స్, శానిటరీ వేర్ రేట్లు పెరిగాయి. పెట్రోలియం అనుబంధ ఉత్పత్తుల కొరతే దీనికి కారణం. బస్తా సిమెంట్ ధర ₹50 పెరగగా, స్టీల్ ధర టన్నుకు 18% పెరిగింది. ప్రొపేన్ గ్యాస్ సరఫరా తగ్గడంతో శానిటరీ వేర్ ధరలు 8-12% పెరిగినట్లు తెలుస్తోంది. ఇంధన కొరత సాకుతో రవాణా ఛార్జీల రూపంలో ఇటుక ధరలు కూడా ₹8 నుంచి ₹10-12కు పెంచినట్లు సమాచారం.
News April 4, 2026
నేవీ అమ్ములపొదిలోకి ‘అరిదమన్’

భారతీయ నౌకాదళంలోకి స్వదేశీ సాంకేతికతతో తయారైన అణు జలాంతర్గామి ‘అరిదమన్’ చేరింది. దీంతో నేవీ అమ్ములపొదిలోని న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ల సంఖ్య మూడుకు పెరిగింది. ఇది INS అరిఘాట్, INS అరిహంత్‌తో పోలిస్తే అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ జలాంతర్గామి 3,500 కిలోమీటర్ల రేంజ్‌కు వెళ్లే అణుసామర్థ్యం గల ఎనిమిది కే-4 మిసైళ్లను మోయగలదు. దీంతో పాటు 24 K-15 సాగరిక న్యూక్లియర్ మిసైల్స్‌ను కూడా మోసే సామర్థ్యం ఉంది.
News April 4, 2026
ఓడామని వదలొద్దు.. ప్రయత్నిస్తే విజయం తథ్యం

అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: సంగీతం రానివారైనా రాగాలను పదేపదే ఆలపిస్తూ ఉంటే కొన్నాళ్లకు వినసొంపుగా పాడగలుగుతారు. వేప ఆకులు చేదుగా ఉన్నా రోజూ తింటూ ఉంటే కొన్నాళ్లకు తియ్యగా అనిపిస్తాయి. ఏ రంగమైనా సాధనతో నైపుణ్యం పెరిగి రాణిస్తారు. తొలిసారి విఫలమైనా తుదకు విజయం సాధిస్తారు.


