News August 5, 2024

‘రావూస్’ ఘటన: కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

image

నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా నిర్వహిస్తున్న ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్‌లో వరదలో మునిగి విద్యార్థులు <<13724979>>చనిపోయిన<<>> ఘటనను సుమోటోగా స్వీకరించింది. వాటిలో భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. కాగా ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.

Similar News

News March 27, 2026

లిల్లీ పంటలో ఆకుగూడు పురుగులను ఎలా నివారించాలి?

image

లిల్లీ పంటను ఆకుగూడు పురుగులు ఆశిస్తే.. మొక్క ఆకులు, పుష్పాలను అవి గూడులా చుట్టి, లోపలి భాగాన్ని తిని తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ పురుగుల నివారణకు ముందుగా ఆ గూడులను దులిపి పురుగులు కనిపిస్తే నాశనం చేయాలి. తర్వాత లీటరు నీటికి ఇమిడాక్లోఫ్రిడ్ 2ml లేదా డైమిథోయేట్ 2ml లేదా ఎసిటామిప్రిడ్ 0.3 గ్రాముల్లో ఏదో ఒకదాన్ని కలిపి మొక్కలపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 27, 2026

NHIDCLలో 15 పోస్టులు.. దరఖాస్తుకు నేడే ఆఖరు

image

నేషనల్‌ హైవేస్‌&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో 15 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు అప్లై చేయడానికి నేడే ఆఖరు తేదీ. అర్హతలు: CA/CMA/ Mcom/ MBA(ఫైనాన్స్‌). జీతం నెలకు రూ.50,000 – 1,60,000. వయసు 34 ఏళ్లు మించకూడదు. స్టేజ్‌-1, స్టేజ్‌-2 రాత పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు www.nhidcl.com చూడండి.

News March 27, 2026

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో ఆయిల్ కంపెనీలు

image

స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇవాళ సెన్సెక్స్ 931 పాయింట్లు నష్టపోయి 74,356 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 260 పాయింట్లు తగ్గి 23,046 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో ఆయిల్ కంపెనీల స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం 94.28గా ఉంది.