News April 29, 2024
రేప్ చేసి.. రాడ్డుతో ముఖంపై పేరు రాసి

UPలోని లఖీంపుర్ ఖేరీలో అమన్(22) ఓ యువతిని(17) ప్రేమిస్తున్నానని వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఈనెల 19న బంధించి 3రోజులు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ముఖంపై ఇనుప రాడ్డుతో తన పేరు రాసి రాక్షసానందం పొందాడు. ఎట్టకేలకు బాధితురాలు ఆ చెర నుంచి బయటపడటంతో విషయం వెలుగు చూసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అతడు HYDలోని ఓ సెలూన్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 15, 2025
విజయ్ సభకు పర్మిషన్.. ఏకంగా 84 కండిషన్లు

TVK చీఫ్ విజయ్ సభకు పోలీసు అధికారులు ఎట్టకేలకు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఏకంగా 84 కండిషన్లు విధించారు. ఈనెల 18న తమిళనాడులోని ఈరోడ్‌లో నిర్వహించే సభకు అనుమతి కోసం టీవీకే నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రూ.50 వేలు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నారు. ఈవెంట్ తర్వాత మొత్తం క్లీన్ చేయాలని సూచించారు. శాంతి భద్రతలు, క్రౌడ్ కంట్రోల్, కార్యక్రమ వేదిక నిర్వహణ తదితరాలపై షరతులు పెట్టారు.
News December 15, 2025
మామిడిలో ఇనుపధాతు లోప లక్షణాలు – నివారణ

మామిడి చెట్లలో ఇనుపధాతు లోపం వల్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోయి ఆకుల సైజు తగ్గిపోతాయి. ఈ తీవ్రత ఎక్కువగా ఉండే మొక్కల ఆకులు పైనుంచి కింద వరకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలలో సాధారణంగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం నివారణకు 2.5 గ్రాముల అన్నభేది+1 గ్రాము నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News December 15, 2025
కొత్త లేబర్ కోడ్స్.. వారానికి 3 రోజుల వీకాఫ్ నిజమేనా?

కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21న 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కొత్త లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చింది. వీటి నేపథ్యంలో వారానికి 4 రోజుల పని దినాలపై కార్మిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. 4 రోజులు పని చేసి 3 వీకాఫ్‌లు కావాలంటే రోజుకు 12Hrs పని చేయాల్సి ఉంటుందని, వారానికి మొత్తం పని గంటలు 48గానే ఉంటాయని తెలిపింది. 12Hrs కంటే ఎక్కువ పని చేస్తే ఓవర్‌టైమ్ జీతం డబుల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.


