News September 25, 2024
అత్యాచార కేసు.. హర్షసాయి లాయర్ ఏమన్నారంటే?

యూట్యూబర్ హర్షసాయిపై నమోదైన అత్యాచార కేసులో ఆయన తరఫు న్యాయవాది కీలక విషయాలు వెల్లడించారు. హర్షసాయి సక్సెస్‌ను చూడలేకనే ఆయనపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. వారిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి లేదని చెప్పారు. ఏడాదిగా వీరిద్దరూ కలవలేదన్నారు. అతని ఎదుగుదల చూడలేకనే నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. హర్ష నటించిన ‘మెగాలోడాన్’ టీజర్‌కు వచ్చిన స్పందనతో ఆమె బ్లాక్మెయిల్ చర్యలకు దిగారని తెలిపారు.
Similar News
News December 6, 2025
నెరవేరిన హామీ.. 3KM సాష్టాంగ నమస్కారాలు

ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరడంతో 3కి.మీ మేర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఓ MLA ఆలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని ఔసా BJP MLA అభిమన్యు కొన్ని నెలల కిందట కిల్లారి గ్రామంలో పర్యటించారు. అక్కడ మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమైతే నీలకంఠేశ్వర ఆలయానికి సాష్టాంగ నమస్కారాలతో వస్తానని మొక్కుకున్నారు. ఇటీవల ఆ ఫ్యాక్టరీ మొదలవడంతో మొక్కు తీర్చుకున్నారు. ఆ కర్మాగారంలో ఉత్పత్తయిన చక్కెరతో అభిషేకం చేశారు.
News December 6, 2025
అభిషేక్ ఊచకోత.. ఈ ఏడాది 100 సిక్సర్లు

విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్లో 100 సిక్సర్లు(36 ఇన్నింగ్స్‌లు) బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ SMATలో సర్వీసెస్‌తో మ్యాచులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఓవరాల్‌గా నికోలస్ పూరన్ గతేడాది 170 సిక్సర్లు బాదారు. ఇక ఈ ఏడాది T20ల్లో అభి 1,499 రన్స్ చేయగా వాటిలో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న ప్రముఖులు

TG: ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్-2047 తొలి రోజు పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడనున్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం ప్రారంభమయ్యే సమ్మిట్ 9న రాత్రి ముగియనుంది.


