News September 17, 2024
మహిళా లాయర్లకు అత్యాచార బెదిరింపులు!

కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని లాయర్ కపిల్ సిబల్ తెలిపారు. ఈ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమ మహిళా లాయర్లపై యాసిడ్ పోస్తామని, రేప్ చేస్తామని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వారి భద్రతకు చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.
Similar News
News October 29, 2025
గుమ్మంపై ఎందుకు కూర్చోకూడదు?

ఇంటి గుమ్మం, మెట్లపై కూర్చోవడం అరిష్టమని పండితులు చెబుతున్నారు. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించే మార్గాన్ని అడ్డుకున్నట్టు అవుతుందని అంటున్నారు. ‘గడపను మనం దైవసమానంగా భావిస్తాం. అందుకే పర్వదినాల్లో అలంకరిస్తాం. అలాంటి దైవసమానమైన గడపపై కూర్చుంటే ఆ దైవాన్ని అవమానించినట్లే. సైన్స్ పరంగా.. ఇంట్లో నుంచి బయటకి వెళ్లే బ్యాక్టీరియాను, నెగెటివ్ ఎనర్జీని వెళ్లకుండా అడ్డుకున్నట్లు అవుతుంది’ అని అంటున్నారు.
News October 29, 2025
BIG ALERT: ఇవాళ అతిభారీ వర్షాలు

AP: మొంథా తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో ఇవాళ అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, NTR, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
News October 29, 2025
అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.


