News February 19, 2025

రేప్‌లు చేసి.. కుంభమేళాకు వెళ్తుండగా!

image

రేప్‌ చేసి జైలుకెళ్లడం, తిరిగొచ్చి మళ్లీ అదే క్రైమ్ చేసే ఓ వ్యక్తి మహాకుంభమేళాకు వెళ్తూ దొరికిపోయాడు. MPకి చెందిన రమేశ్ సింగ్ 2003లో 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసి పదేళ్లు జైలుకెళ్లొచ్చాడు. 2014లో 8ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసి టెక్నికల్ ఆధారాలు లేక 2019లో జీవితఖైదు శిక్ష నుంచి బయటపడ్డాడు. తాజాగా, FEB 2న 11ఏళ్ల బాలికపై హత్యాచారం చేశాడు. ఆపై ప్రయాగ్‌రాజ్ వెళ్తుండగా జైపూర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.

Similar News

News November 19, 2025

కన్నె స్వాములు తప్పక చూడాల్సిన స్థానం

image

శబరిమల యాత్రలో పేరూర్‌తోడు నుంచి 12KM దూరంలో కాళైకట్టి అనే కారడవి ఉంటుంది. నేడు ఇది పచ్చని తోటగా మారింది. ఈ స్థలానికి 2 ప్రాముఖ్యతలున్నాయి. ఓనాడు అయ్యప్ప స్వామి తన సైన్య వృషభాలను ఇక్కడే కట్టేశాడట. మరోనాడు మహిషీ మర్దనం చూడడానికి వచ్చిన పరమేశ్వరుడు తన వృషభ వాహనాన్ని ఇక్కడ బంధించాడట. తొలిసారి యాత్ర చేసే కన్నె స్వాములు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. <<-se>>#AyyappaMala<<>>

News November 19, 2025

భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు

image

ఎన్టీపీసీ లిమిటెడ్ 4 ఎగ్జిక్యూటివ్(<>IBD<<>>) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీడీఎం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. నెలకు రూ.90వేలు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/

News November 19, 2025

లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

image

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.