News December 31, 2024

కాంగ్రెస్ పాలనలో పెరిగిన అత్యాచారాలు: BRS

image

TG: రాష్ట్రంలో ఏడాది కాలంలో క్రైమ్ రేట్ పెరిగిందని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు ఏడాదిలోనే 28.94శాతం పెరిగాయని పేర్కొంది. సంఘటనలపై పోలీస్ రెస్పాన్స్ టైమ్ తగ్గిందని తెలిపింది. రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నాడా? అని ప్రశ్నించింది. డబ్బు సంచుల కోసం మూసీ ప్రాజెక్టుపై సమీక్ష చేసే సీఎం రేవంత్‌కు ఆడబిడ్డలపై పెరిగిన నేరాలపై సమీక్షలు చేయట్లేదని దుయ్యబట్టింది.

Similar News

News October 25, 2025

కార్తిక మాసంలో ఏరోజు పవిత్రమైనది?

image

కార్తీక మాసంలో ప్రతి దినం భగవత్ చింతనకు శ్రేష్ఠమైనదే. అయితే కార్తీక సోమవారాలు శివుడికి ప్రీతికరమైనవి. ఈ రోజున ఉపవాసం, రుద్రాభిషేకం చేసేవారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోట, ఉసిరి చెట్టును పూజించడం శుభాలకు మూలం. కార్తీక పౌర్ణమి ఈ మాసానికి శిఖరాయమానం. ఈ రోజున చేసే నదీ స్నానం, దీపారాధన ద్వారా శివకేశవుల అనుగ్రహం లభించి, జన్మజన్మల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

News October 25, 2025

నా కొడుకు వ్యాఖ్యలను వక్రీకరించారు: సిద్దరామయ్య

image

తన రాజకీయ జీవితంపై కొడుకు యతీంద్ర చేసిన <<18075196>>వ్యాఖ్యలను<<>> వక్రీకరించారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కాబోయే సీఎం ఎవరనే విషయమై కాకుండా విలువల గురించి తన కొడుకు మాట్లాడారని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై తాను ఇప్పుడే స్పందించనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ విషయమై ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడతానని చెప్పారు.

News October 25, 2025

విరాట్ త్వరగా ఫామ్‌లోకి రావాలి: రవిశాస్త్రి

image

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీలైనంత త్వరగా ఫామ్‌లోకి రావాలని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ‘జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. రోహిత్, కోహ్లీ, ఎవరైనా రిలాక్స్ అవడానికి లేదు. ఫుట్‌వర్క్ విషయంలో విరాట్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. వన్డే క్రికెట్‌లో అతని రికార్డు అమోఘం. రెండు వన్డేల్లోనూ పరుగులు చేయకపోవడం కోహ్లీని నిరాశకు గురిచేసి ఉండవచ్చు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.