News May 4, 2024
‘ప్రతినిధి-2’ విడుదల తేదీ ఫిక్స్

హీరో నారా రోహిత్ నటిస్తున్న ‘ప్రతినిధి-2’ మూవీ విడుదల తేదీ ఫిక్సయింది. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గత నెల 25నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ‘ప్రతినిధి-2’లో నారా రోహిత్ న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Similar News
News November 27, 2025
మిరపలో బూడిద తెగులు – నివారణ

మిరపను నవంబర్ నుంచి జనవరి వరకు బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. తెల్లని పొడి పూత ఎక్కువగా ఆకుల దిగువ భాగంలో కనిపిస్తుంది. ఆకుల పై భాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. తెగులు సోకిన ఆకుభాగం గోధుమ రంగులోకి మారుతుంది. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో అజోక్సిస్ట్రోబిన్ 23% SC 200ml లేదా టెబుకొనజోల్25% WG 300 గ్రా. లేదా సల్ఫర్ 80% WP 800 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News November 27, 2025
ఏకగ్రీవం.. ఒకే కుటుంబం నుంచి సర్పంచ్, వార్డు సభ్యులు

TG: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో గ్రామాల్లో సందడి మొదలైంది. వికారాబాద్ జిల్లా మంతన్ గౌడ్ గ్రామంలో ఒకే ఎస్టీ కుటుంబం ఉంది. అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఉండటంతో అదే కుటుంబానికి చెందిన వ్యక్తులు సర్పంచ్, వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు. అలాగే ఆదిలాబాద్(D) తేజాపూర్లో కోవ రాజేశ్వర్, సిరిసిల్ల(D) రూప్లానాయక్ తండాలో రూప్లానాయక్ను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
News November 27, 2025
వాటర్ హీటర్ వాడుతున్నారా?

చాలా మంది నీటిని వేడి చేసేందుకు వాటర్ హీటర్లు ఉపయోగిస్తుంటారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు. చిన్న పిల్లలు ఆడుకునే చోట.. హీటర్తో నీళ్లను వేడిచేయకూడదు. బాత్రూమ్లో పెడితే అక్కడ తడిగా ఉంటుంది కాబట్టి, షాక్ కొట్టే ప్రమాదం ఉంది. ఇమ్మర్షన్ రాడ్ పూర్తిగా నీటిలో మునిగిన తరవాతనే.. స్విఛ్ ఆన్ చెయ్యాలి. మెటల్ బకెట్లో పెట్టవద్దు. తడి చేతులతో, తడి బట్టలతో ముట్టుకోకూడదు.


