News June 14, 2024

RARE: ఏనుగుకు కవల పిల్లలు

image

థాయ్‌లాండ్‌లో ఓ ఏనుగుకు కవల పిల్లలు జన్మించాయి. ఇందులో ఆడ, మగ ఏనుగు ఉన్నాయి. రాయల్ క్రాల్‌లోని ఆయుత్తాయ ఎలిఫెంట్ ప్యాలెస్‌లో చంచూరి (35) అనే ఏనుగుకు ఒకదాని తర్వాత ఒకటి జన్మించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఏనుగులకు కవలలు జన్మించేందుకు ఒక శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. అవి 22 నెలలపాటు గర్భధారణతో ఉంటాయి. నాలుగేళ్లకోసారి పిల్లలకు జన్మనిస్తాయి.

Similar News

News February 1, 2025

4 స్కీమ్స్‌.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు

image

TG: గత నెల 26న ప్రారంభించిన 4 పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే 563 గ్రామాల్లో ఈ స్కీమ్స్‌ను ప్రారంభించింది. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

News February 1, 2025

రాష్ట్రంలో ఉక్కపోత షురూ

image

AP: రాష్ట్రంలో రెండు రోజులుగా ఉక్కపోత మొదలైంది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిన్న 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది. మరోవైపు 2024 మాదిరే 2025 కూడా అత్యంత వేడి సంవత్సరంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

News February 1, 2025

బహిరంగంగా దూషణ జరిగితేనే SC, ST కేసు: సుప్రీంకోర్టు

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నేర నిరూపణ జరగాలంటే బహిరంగంగా దూషించినట్లు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కేసుకు సంబంధించి నాలుగు గోడల మధ్య జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కోర్టు విచారించింది. అందరూ చూస్తుండగా ఘటన జరగలేదంటూ కోర్టు కొట్టివేసింది. సెక్షన్ 3(1)(ఎస్) నిరూపితం కావాలంటే ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను కులం పేరుతో బహిరంగంగా దూషించి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.