News February 7, 2025
వైద్యశాస్త్రంలో అరుదు.. మోచేతిపై పురుషాంగం

వైద్యశాస్త్రంలోని సంఘటనలు అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే HYDలో జరిగింది. సోమాలియాకు చెందిన యువకుడికి చిన్నప్పుడు సున్తీ కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకి పురుషాంగం తొలగించారు. తిరిగి పొందేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరికి హైటెక్ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించాడు. వైద్యులు అతడి మోచేతిపై పురుషాంగాన్ని డెవలప్ చేసి, దాన్ని మర్మాంగాలు ఉండే ప్లేస్‌లో అమర్చారు.
Similar News
News March 29, 2026
BBC వార్తను ఖండించిన కేంద్రం

దేశంలో 5 రోజులకు మాత్రమే సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయంటూ BBC హిందీలో వచ్చిన వార్తను కేంద్రప్రభుత్వం (PIB ఫ్యాక్ట్‌చెక్) ఖండించింది. అది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేసింది. దేశంలో 60 రోజులకు సరిపడా స్టాక్ ఉందని తెలిపింది. మరో రెండు నెలలకు వరకు సప్లైకి ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని దేశ ప్రజలను కోరింది.
News March 29, 2026
అందం, ఆరోగ్యం.. కర్బూజతో సొంతం

ఎండా కాలంలో అధికంగా లభించే కర్బూజలో 95% నీరు, విటమిన్ A, C, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. ‘BP అదుపులో ఉండి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. చర్మంపై ముడతలు తగ్గి సహజమైన కాంతి వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt
News March 29, 2026
ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు US సిద్ధం!

పశ్చిమాసియాలో యుద్ధం మరో స్థాయికి చేరనుంది. ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు వేలాది <<19503626>>US సైనికులు<<>> అక్కడికి చేరుకుంటున్నారు. ఖర్గ్ ద్వీపం, హార్ముజ్ జలసంధి సమీపంలోని స్థావరాలపై కొన్ని వారాలపాటు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అయితే దీనికి ట్రంప్ అనుమతిచ్చారా లేదా అనేది క్లారిటీ లేదంది. ఆ ఆపరేషన్ పూర్తిస్థాయి దండయాత్రలా కాకుండా వ్యూహాత్మకంగా ఉంటుందని పేర్కొంది.


