News December 27, 2024
RARE PHOTO: తొలి డాక్టరమ్మలు!

పైనున్న ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు మహిళలెవరని ఆలోచిస్తున్నారా? ఈ ముగ్గురూ వైద్యులుగా లైసెన్స్ పొందిన తొలి మహిళలు. 1885లో తీసిన ఈ ఫొటోలో ఓ భారతీయురాలు కూడా ఉండటం విశేషం. ఆమె పేరు ఆనందీబాయి జోషి(చీరలో ఉన్నారు). మరో ఇద్దరు జపాన్‌కు చెందిన కెయి ఒకామి, సిరియా నుంచి సబాత్ ఇస్లాంబూలీ. కాగా, ఆనందీబాయి 1886లో వైద్య విద్యలో పట్టా పొందారు.
Similar News
News January 23, 2026
గ్రామ ప్రియ కోళ్ల గురించి తెలుసా?

గ్రామ ప్రియ కోళ్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్లు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆరు నెలల వయసు వచ్చేసరికే రెండున్నర కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఏడాదిలో 250 గుడ్లను పెడతాయి. అధిక వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడవని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.
News January 23, 2026
జేడ్ రోలర్‌తో మెరిసే చర్మం

అలసిన ముఖానికి సాంత్వన కలిగించే అద్భుతమైన పరికరం జేడ్ రోలర్. ముఖాన్ని శుభ్రం చేసి రోజ్‌వాటర్ అద్దాలి. తర్వాత జేడ్ రోలర్‌తో సవ్య, అపసవ్య దిశల్లో మసాజ్ చేయాలి. రోజుకి మూడుసార్లు మసాజ్ చేస్తే చర్మంపై లింఫాటిక్ ఫ్లూయిడ్ విడుదల తగ్గుతుంది. మసాజ్ చేయడంవల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ జరిగి, ఆక్సిజన్ అంది చర్మం కాంతివంతం అవుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గి, చర్మం తాజాగా ఉంటుంది.
News January 23, 2026
ఏ శుభకార్యానికైనా నేడు ఉత్తమ దినం!

నేడు వసంత పంచమి. చదువుల తల్లిని కొలిచే పవిత్రమైన రోజు. ఇది అక్షరాభ్యాసాలకే కాకుండా వివాహం, అన్నప్రాశన, గృహప్రవేశం వంటి ఎన్నో శుభకార్యాలకు ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన చేసే ఏ కొత్త పనికైనా దైవబలం తోడై విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేడు ఏ రంగు దుస్తులు ధరిస్తే, వేటిని పూజిస్తే సరస్వతీ దేవి కటాక్షంతో నైపుణ్యాలు పెరుగుతాయో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


