News September 22, 2024

ఈ రోజు అరుదైనది.. భార‌త‌దేశానికి కూడా

image

భారతదేశంతో సహా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈ రోజు(ఆదివారం) ప‌గ‌లు, రాత్రి వేళ‌లు దాదాపు స‌మానంగా ఉండ‌నున్నాయి. ఈ రోజు సాయంత్రం 6:13 గంట‌ల‌కు సెప్టెంబ‌ర్ ఈక్వినాక్స్ చోటుచేసుకోనుంది. అంటే, సూర్యుడు ఉత్తరార్ధ గోళం నుంచి భూమ‌ధ్య రేఖ‌ను దాటుతూ దక్షిణార్ధ గోళం వైపు కదులుతాడు. ఫలితంగా భారత్ సహా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పగలు-రాత్రి వేళ‌లు దాదాపు సమానంగా ఉంటాయి. ఏటా Mar, Sep నెలల్లో ఇలా జరుగుతుంది.

Similar News

News November 5, 2025

ట్రంప్ పార్టీ ఓటమి

image

అమెరికాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బర్గర్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అబిగైల్‌కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్‌కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం.

News November 5, 2025

సంతానలేమిని నివారించే ఖర్జూరం

image

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.

News November 5, 2025

SSC-కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఫలితాలు రిలీజ్

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 552 గ్రూప్-B కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేసింది. ఆగస్టు 12న పేపర్ 1 పరీక్షను నిర్వహించగా.. పేపర్ 2 పరీక్షకు 3,642మంది క్వాలిఫై అయ్యారు. కటాఫ్ మార్కులను వెబ్‌సైట్‌లో పెట్టింది. పేపర్ 2 పరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. వెబ్‌సైట్: https://ssc.nic.in/