News March 10, 2025

రష్మిక మందన్నకు ప్రాణభయం: కొడవ వర్గం ఆందోళన

image

నటి రష్మిక మందన్న ప్రాణాలకు ముప్పు ఉందని కొడవ కులస్థులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ఆమెను రాజకీయాల్లోకి లాగిందని విమర్శించారు. ఆమెకు ముప్పు ఉందని, ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల KA <<15639271>>MLA <<>>ఒకరు ఆమెకు తగిన బుద్ధి చెప్తామని బెదిరించడం తెలిసిందే. KAలోని కొడగు ప్రాంతంలో కొడవ వర్గానిదే ఆధిపత్యం. సంప్రదాయ హిందువులైన వీరు కొడవ భాష మాట్లాడతారు. రష్మిక ఈ వర్గానికే చెందుతారు.

Similar News

News October 22, 2025

స్థానిక ఎన్నికలపై రేపే తుది నిర్ణయం?

image

TG: స్థానిక ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి రేపు తెరపడే అవకాశం కనిపిస్తోంది. పాత పద్ధతిలోనే ఎలక్షన్స్ వెళ్లాలా? లేదా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే నిర్వహించాలా? అనేదానిపై CM రేవంత్ అధ్యక్షతన మ.3 గంటలకు జరిగే క్యాబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. పాత పద్ధతినే అవలంబిస్తే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఆస్కారముంది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్‌కు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.

News October 22, 2025

కొత్త దర్శకుల విజయం: వినూత్న కథాంశాలే బలం!

image

వినూత్న కథలతో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో యువ డైరెక్టర్లు సఫలమవుతున్నారు. సూపర్ హీరో జోనర్‌ ‘హనుమాన్’తో భారీ విజయం పొందారు ప్రశాంత్ వర్మ. HIT 1&2తో క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌తో శైలేష్ కొలను అదరగొట్టారు. అరిషడ్వర్గాలు అనే మైథలాజికల్ అంశంపై సస్పెన్స్ థ్రిల్లర్ ‘అరి’ మూవీతో మెప్పించారు డైరెక్టర్ జయశంకర్. 96, సత్యంసుందరంతో తమిళ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలుగువాళ్లకు దగ్గరయ్యారు.

News October 22, 2025

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు గంటల వ్యవధిలో <<18069819>>మరోసారి<<>> భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.4,690 తగ్గి రూ.1,25,890కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిిడి రూ.4,300 పతనమై రూ.1,15,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ఏకంగా రూ.7,000 క్షీణించి రూ.1.75 లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.