News March 4, 2025
రష్మిక మందన్న vs కాంగ్రెస్: ఆమెకు మద్దతుగా BJP, JDS

కన్నడ సినీ పరిశ్రమ, నటి <<15639271>>రష్మిక<<>> మందన్నపై కాంగ్రెస్ మంత్రులు, MLAల వ్యాఖ్యలను BJP, JDS ఖండించాయి. కర్ణాటక LoP, BJP నేత R అశోకా, JDS నేత నిఖిల్ కుమార స్వామి ఆమెకు మద్దతు ప్రకటించారు. మీరు చెప్పినట్టల్లా ఆడటానికి నటులేమీ కాంగ్రెస్ కార్యకర్తలు కారని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించిన కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆమె సహా కొందరు నటులు రాకపోవడంతో ఈ వివాదం మొదలైంది. DY CM డీకే సినీ పరిశ్రమను హెచ్చరించారు.
Similar News
News January 11, 2026
కలుపు తీయని పైరు కర్ర చేయదు

పొలంలో కలుపును రైతులు సరైన సమయంలో గుర్తించి తొలగించకపోతే పంటకు అందాల్సిన పోషకాలను ఆ కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. దీని వల్ల పైరులో ఎదుగుదల లోపిస్తుంది. ఫలితంగా సరిగా గింజ పట్టదు లేదా బలమైన ‘కర్ర’ (కాండం)గా ఎదగదు. అలాగే ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలన్నా, ఒక వ్యక్తి గొప్పగా ఎదగాలన్నా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న అనవసరమైన విషయాలను, లోపాలను ఎప్పటికప్పుడు తొలగించుకొని ముందుకు సాగాలని ఈ సామెత తెలియజేస్తుంది.
News January 11, 2026
రేపు PSLV-C62 ప్రయోగం

AP: ISRO మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి రేపు ఉదయం 10.17 గంటలకు PSLV-C62 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనుంది. కొత్త ఏడాదిలో ISROకు ఇదే తొలి ప్రయోగం. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఈరోజు మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రారంభించనున్నారు.
News January 11, 2026
బంగారం ధర రూ.2 లక్షలకు చేరనుందా?

2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు 2026లోనూ అదే పంథా కొనసాగించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,500 డాలర్లు ఉంది. ఇది మార్చి నాటికి 5,000 డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నట్లు HSBC కమోడిటీ పేర్కొంది. ఇక దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే రూ.1.41 లక్షల వద్ద ఉండగా, జూన్ నాటికి రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.


