News January 27, 2025
రష్మిక మందన్న కొత్త సినిమాకు బ్యాన్ భయం!

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘ఛావా’కు చిక్కులు ఎదురవుతున్నాయి. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను ముందుగా చరిత్రకారులకు చూపించాలని MH మంత్రి ఉదయ్ సమంత్ డిమాండ్ చేశారు. వారు సరే అన్నాకే విడుదల చేయాలన్నారు. లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. శంభాజీ రాజే డాన్స్ సీన్పైనా అభ్యంతరం చెప్పారు. ఆ సీన్ తొలగించాలని, ఆయన గౌరవానికి భంగం కలిగితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు.
Similar News
News November 5, 2025
2,500 విద్యాసంస్థలు మూతబడ్డాయి.. బండి సంజయ్ ఫైర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నీరుగార్చుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ‘రాష్ట్ర చరిత్రలో తొలిసారి 2,500 విద్యాసంస్థలు మూతబడ్డాయి. BRS పాలనలో రెండేళ్లు, కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక స్టూడెంట్స్, స్టాఫ్ ఇబ్బందులు పడుతున్నారు. రూ.10,500 కోట్ల బకాయిల్లో సగం చెల్లించమని యాజమాన్యాలు కోరినా ప్రభుత్వం కమిటీలంటూ కాలయాపన చేస్తోంది’ అని ట్వీట్ చేశారు.
News November 5, 2025
ఇలా అయితే థియేటర్లు ఖాళీ అవుతాయ్: సుప్రీం

మూవీ టికెట్తో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం ఒక సినిమాకి ₹1,500 నుంచి ₹2,000కు ఖర్చవుతుంది. ధరలను నియంత్రించకపోతే సినిమా హాళ్లు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉంది’ అని కోర్టు పేర్కొంది. కర్ణాటకలో మూవీ టికెట్ ధరను రూ.200కు పరిమితం చేయడంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంను ఆశ్రయించగా ఈ విధంగా స్పందించింది.
News November 5, 2025
వరిని ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి పంట కోసిన తర్వాత పనల మీద గింజలు కొంత వరకు ఎండుతాయి. తూర్పారబట్టి శుభ్రపరచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమను 12-14%కు తగ్గించాలి. అయితే ధాన్యంలో తేమ ఒక్కసారిగా తగ్గకూడదు. క్రమక్రమంగా తగ్గాలి. దీని కోసం సాధారణమైన ఎండలో ధాన్యాన్ని పరిచి మధ్యమధ్యలో తిరగతిప్పాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరబెడితే గింజల్లో తేమ ఒక్కసారిగా తగ్గి గింజలపై పగుళ్లు వచ్చి.. ధాన్యం మిల్లింగ్ సమయంలో నూకలయ్యే అవకాశం ఎక్కువ.


