News March 13, 2025
రష్మిక సంచలనం.. రెండేళ్లలో ₹3,300 కోట్లు!

సినీ పరిశ్రమలో రష్మిక మందన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు కారణం. గత రెండేళ్లలో రష్మిక నటించిన సినిమాలు వరల్డ్ వైడ్‌గా ₹3,300 కోట్లు వసూలు చేశాయి. హిందీలోనే దాదాపు ₹1850కోట్లు రాబట్టాయి. దీంతో దీపిక, అలియా భట్ వంటి స్టార్ల కంటే రష్మికకే ఎక్కువ సక్సెస్ దక్కింది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ‘సికందర్’, ధనుష్ ‘కుబేర’లో నటిస్తున్నారు.
Similar News
News March 31, 2026
పోలీసుల అండతో TDP గూండా రాజ్యం: జగన్

AP: పోలీసుల అండతో TDP గూండా రాజ్యం నడుపుతోందని YCP చీఫ్ YS జగన్ దుయ్యబట్టారు. గురజాల నియోజకవర్గ నేతలు జగన్‌ను తన నివాసంలో కలిశారు. TDP మూకలు దాడులు చేస్తున్నాయని, FEBలో ఇద్దరిని చంపారని తెలిపారు. దీనిపై జగన్ మాట్లాడుతూ వారి దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొందామని, వ్యవస్థను దిగజార్చేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ అందిస్తుందని భరోసా ఇచ్చారు.
News March 31, 2026
రంగులు మార్చే కండోమ్స్

సెక్స్ సంబంధిత వ్యాధులను గుర్తించేందుకు బ్రిటన్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు వినూత్న కాన్సెప్ట్‌ను డెవలప్ చేశారు. ‘S.T. EYE’ పేరుతో కలర్ కండోమ్స్‌ను రూపొందించారు. శరీరంలో బాక్టీరియాతో రియాక్ట్ అవగానే ఇన్ఫెక్షన్‌ను బట్టి కండోమ్ రంగు మారుతుంది. Ex: గ్రీన్ కలర్ వస్తే క్లామిడియా, బ్లూ వస్తే సిఫిలిస్ అని అర్థం. దీంతో వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది ఇంకా ప్రయోగదశలోనే ఉంది.
News March 31, 2026
253వ సారి పోటీకి దిగిన ‘ఎలక్షన్ కింగ్’

ఎలక్షన్ కింగ్‌గా పేరొందిన పద్మరాజన్(65) TNలోని మెట్టూరు నుంచి 253వ సారి నామినేషన్ వేశారు. ఈయన 1988 నుంచి దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ బరిలో నిలుస్తున్నారు. PV, వాజ్‌పేయీ, మోదీ, మన్మోహన్, కరుణానిధి, జయలలిత, స్టాలిన్, పళనిస్వామి వంటి ప్రముఖులపైనా పోటీకి దిగారు. ఇప్పటివరకు డిపాజిట్లకే రూ.కోటికి పైగా ఖర్చు చేయడం గమనార్హం. సామాన్యులు ఎవరితోనైనా పోటీ పడొచ్చని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన చెబుతుంటారు.


