News March 13, 2025
రష్మిక సంచలనం.. రెండేళ్లలో ₹3,300 కోట్లు!

సినీ పరిశ్రమలో రష్మిక మందన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు కారణం. గత రెండేళ్లలో రష్మిక నటించిన సినిమాలు వరల్డ్ వైడ్‌గా ₹3,300 కోట్లు వసూలు చేశాయి. హిందీలోనే దాదాపు ₹1850కోట్లు రాబట్టాయి. దీంతో దీపిక, అలియా భట్ వంటి స్టార్ల కంటే రష్మికకే ఎక్కువ సక్సెస్ దక్కింది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ‘సికందర్’, ధనుష్ ‘కుబేర’లో నటిస్తున్నారు.
Similar News
News March 14, 2025
HOLI: సెలబ్రేషన్స్ పేరుతో హద్దులు దాటకండి..

హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం కామన్. అయితే ఇదే అదనుగా కొందరు తమలోని ఆకతాయితనాన్ని బయటకు తీస్తారు. ఇది పరిధిలో ఉంటే పర్లేదు కానీ హద్దు దాటితేనే సమస్య. ఎదుటి వారి ఇష్టంతోనే వారిపై రంగులు చల్లేందుకు ప్రయత్నించండి. పండగ పేరుతో ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి, రంగులు పూసి ఇబ్బంది పెట్టకండి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో హుందాగా వ్యవహరించండి.
HAPPY HOLI
News March 14, 2025
హిందీ పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థులకు మరో ఛాన్స్

హోలీ పండగ కారణంగా రేపు హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని బోర్డు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పండగ మార్చి 15న నిర్వహించుకుంటున్నారని ఎగ్జామ్ కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ తెలిపారు. పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్ణయించినా రేపు ఎగ్జామ్ రాయలేని స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
News March 14, 2025
ఇవాళ పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ

AP: ఇవాళ పిఠాపురంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో పూర్తిచేశారు. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ.3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరనున్నారు. 3.45 గంటలకు సభా స్థలికి చేరుకొని శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రికి కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌజ్‌లో బస చేస్తారు.