News November 13, 2024
‘పుష్ప-2’ సెకండ్ హాఫ్ డబ్బింగ్ మొదలెట్టిన రష్మిక

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సెకండ్ హాఫ్ డబ్బింగ్ స్టార్ట్ చేసినట్లు నటి రష్మిక ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ‘షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తవగా అది అద్భుతంగా వచ్చింది. పూర్తి సినిమాను చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా, పట్నాలో ఈనెల 17న ట్రైలర్ ఈవెంట్ జరగనుంది.
Similar News
News December 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 96 సమాధానం

ఈరోజు ప్రశ్న: సూర్యుడి వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి, సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్లిపోయింది ఎవరు?
సమాధానం: సూర్య భగవానుడి భార్య అయిన సంజ్ఞా దేవి తనలాగే ఉండే ఛాయాదేవిని సృష్టించి అడవులకు వెళ్లిపోయింది. సూర్యుని ద్వారా సంజ్ఞా దేవికి యముడు, యమున జన్మించారు. ఛాయాదేవికి శని, సావర్ణి, తపతి జన్మించారు. <<-se>>#Ithihasaluquiz<<>>
News December 14, 2025
ఉసిరితో మహిళలకు ఎన్నో లాభాలు

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, PCOD, డయాబెటీస్ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీన్ని పచ్చిగా, ఎండబెట్టి పొడిలా, పచ్చడి, జ్యూస్ ఇలా నచ్చిన విధంగా తీసుకోవచ్చంటున్నారు.
News December 14, 2025
ఉగ్రవాదాన్ని సహించబోం.. సిడ్నీ అటాక్పై మోదీ

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్లో జరిగిన <<18561798>>కాల్పుల<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజంపై చేసే పోరాటానికి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాగా కాల్పుల్లో ఇప్పటిదాకా 12 మంది చనిపోయారు. ఓ దుండగుడు హతమవ్వగా, పట్టుబడిన వ్యక్తి నవీద్ అక్రమ్గా గుర్తించారు.


