News January 26, 2025

మూడు చోట్ల కాలికి ఫ్రాక్చర్: రష్మిక

image

తన కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. కండరాల్లో చీలిక కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘2 వారాలుగా కనీసం నడవలేకపోతున్నా. ఎక్కడికి వెళ్లినా ఒంటి కాలిపైనే వెళ్తున్నా. నాపై మీరు చూపించే ప్రేమ, అభిమానం వల్లే నాకు ఈ నొప్పి తెలియడం లేదు. నాకు మద్దతుగా నిలిచినవారికి రుణపడి ఉంటా’ అని పేర్కొన్నారు. కాగా రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ FEB 14న రిలీజ్ కానుంది.

Similar News

News December 7, 2025

హనుమాన్ చాలీసా భావం – 31

image

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా|
అసవర దీన్హ జానకీ మాతా||
హనుమంతుడు 8 రకాల సిద్ధులు, 9 రకాల సంపదలు ఇవ్వగలిగే సామర్థ్యం కలవాడు. ఈ అద్భుతమైన, అత్యున్నతమైన వరాన్ని సాక్షాత్తు సీతాదేవి లంకలో ప్రసాదించింది. కాబట్టి, హనుమంతుడు తన భక్తులకు అన్ని రకాల శక్తులను, సంపదలను, కోరిన కోరికలను తీర్చగలిగే శక్తిమంతుడు అని మనం గ్రహించాలి. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 7, 2025

ESIC ఫరీదాబాద్‌లో ఉద్యోగాలు

image

ఫరీదాబాద్‌‌లోని <>ESIC <<>>మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌లో 50 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 10, 17తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,60,226, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,73,045, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,48,669 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 7, 2025

సర్పంచ్‌గా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చో తెలుసా?

image

TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేయవచ్చు. అన్ని/ఏదో ఒక చోట గెలిస్తే ఒక స్థానాన్ని ఎంచుకుని, మిగతా చోట్ల రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో అలా కుదరదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానంలో మాత్రమే పోటీ చేయడానికి పర్మిషన్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల బరిలోకి దిగితే పోటీ చేసిన అన్ని చోట్లా అనర్హుడిగా ప్రకటిస్తారు.
Share It