News February 9, 2025

థాంక్యూ మీట్‌కు హాజరుకాకపోవడంపై రష్మిక పోస్ట్

image

‘పుష్ప-2’ థాంక్యూ మీట్‌కు హాజరుకాని హీరోయిన్ రష్మిక ఆసక్తికర పోస్ట్ చేశారు. సుకుమార్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కలిసి తమ శ్రమతో ఇలాంటి అద్భుతాన్ని అందించినందుకు థాంక్యూ చెప్పారు. శ్రీవల్లి హృదయంలో తమకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగం చేసినందుకు, గుర్తుండిపోయే రోల్ ఇచ్చినందుకు మరోసారి థాంక్యూ అని రాసుకొచ్చారు.

Similar News

News March 6, 2026

సుఖోయ్ క్రాష్.. ఇద్దరు పైలట్లు మృతి

image

అస్సాంలో నిన్న సుఖోయ్ <<19308614>>యుద్ధ విమానం<<>> క్రాష్ అయిన విషయం తెలిసిందే. అందులో ఉన్న పైలట్లు అనుజ్, పుర్వేష్ దురగ్‌ఖర్ చనిపోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించింది. నిన్న రాత్రి సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గాల్లోకి ఎగిరిన కాసేపటికే 7.42pmకు రాడార్ నుంచి ఫైటర్ జెట్ కాంటాక్ట్ కోల్పోయినట్లు IAF తెలిపింది.

News March 6, 2026

నేపాల్ రిజల్ట్స్.. లీడింగ్‌లో RSP

image

హిమాలయ దేశం నేపాల్‌లో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) 32 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. పార్టీ చీఫ్ రబి లామిచానే, సీనియర్ నేత బాలెన్ షా ముందంజలో కొనసాగుతున్నారు. RSP విజయం సాధిస్తే బాలెన్ షా(ఫొటోలో) PM అయ్యే అవకాశం ఉంది. పూర్తి రిజల్ట్స్ ఇవాళ సాయంత్రంలోపు రానున్నాయి.

News March 6, 2026

సీఎం పదవికి ఈ నెల 16న నితీశ్ రాజీనామా?

image

రాజ్యసభ అభ్యర్థిగా నిన్న నామినేషన్ వేసిన నితీశ్ కుమార్ ఈ నెల 16న ఫలితాలు వెలువడ్డాక బిహార్ CMగా రాజీనామా చేసే అవకాశం ఉంది. 2 నెలల తర్వాత ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. అయితే నితీశ్‌కు కీలక శాఖ ఇస్తారా లేక అనారోగ్య సమస్యల కారణంగా అప్రాధాన్య పోస్టుకు పరిమితం చేస్తారా అనేది ఆసక్తికరం. ఇక బిహార్ కొత్త ప్రభుత్వంలో నితీశ్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతోంది.