News November 23, 2024

ప్రియాంకపై జాతీయ జనసేన అభ్యర్థి పోటీ

image

కేరళ వయనాడ్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ గెలుపు దిశగా సాగుతున్నారు. అయితే ఈమెపై ఓ తెలుగు వ్యక్తి జాతీయ జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. తిరుపతికి చెందిన ఆయన పేరు దుగ్గిరాల నాగేశ్వరరావు. ఈయన పార్టీకి అధ్యక్షుడు కూడా. AP ప్రత్యేక హోదా అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, జాతీయ స్థాయిలో వినిపించాలనే పోటీ చేస్తున్నానన్నారు. ఆయనకు ప్రస్తుతానికి 273 ఓట్లు వచ్చాయి.

Similar News

News January 19, 2026

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ పవార్

image

ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు సత్వరమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 43 అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలపైనే 21 దరఖాస్తులు వచ్చాయన్నారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని, అధికారులు విధిగా హాజరై సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు.

News January 19, 2026

ఇతిహాసాలు క్విజ్ – 128 సమాధానం

image

ప్రశ్న: అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలిసినా, బయటకు రావడం ఎందుకు తెలియదు?
సమాధానం: అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానం గురించి వివరిస్తుంటే విన్నాడు. అయితే, వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్పే సమయానికి సుభద్ర నిద్రపోయింది. దీంతో గర్భంలో ఉన్న అభిమన్యుడికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసింది. బయటకు రావడం తెలియలేదు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 19, 2026

భారత పర్యటనలో UAE అధ్యక్షుడు

image

UAE అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇద్దరూ కారులో ప్రయాణించారు. నహ్యాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆకాంక్షించారు.