News October 14, 2024

APలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్: CM

image

AP: అమరావతిలో రతన్ టాటా పేరుతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా దీనిని మారుస్తామన్నారు. ‘MSME, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు 5% ఇన్సెన్టివ్స్ ఇస్తాం. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10% ప్రోత్సాహకం అందిస్తాం’ అని పరిశ్రమలపై సమీక్షలో సీఎం వెల్లడించారు.

Similar News

News October 14, 2024

అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ: జగన్

image

AP: కొత్త లిక్కర్‌ పాలసీతో CM చంద్రబాబు రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. దీనిని వెంటనే సరిదిద్దుకోవాలని, లేదంటే ప్రజల తరఫున ఉద్యమిస్తామన్నారు. ‘రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. మీరు, మీ వాళ్లు డబ్బు సంపాదించుకోవడం కోసం తెచ్చిన ఈ లిక్కర్‌ పాలసీ ప్రమాదకరం. అక్రమార్జన కోసం ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రైవేటుకు అప్పగించారు’ అని Xలో ఆరోపించారు.

News October 14, 2024

సెప్టెంబర్‌లో సామాన్యుడిపై ధ‌ర‌ల మోత‌

image

వ‌స్తు, సేవ‌ల ధ‌ర‌లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో సామాన్యుడి న‌డ్డివిరిచాయి. రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలో గత ఏడాది Sepతో పోలిస్తే 5.49 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణ రేటు 5.87% వద్ద ఉంటే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం 5.05%గా నమోదైంది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ద్రవ్యోల్బణం 9.24 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరలు 9.08%, పట్ట‌ణాల్లో 9.56% అధికమయ్యాయి.

News October 14, 2024

బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వనున్న స్మృతీ ఇరానీ!

image

మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రూపాలీ గంగూలీ కీలకపాత్ర పోషిస్తున్న ‘అనుపమా’లో స్మృతీ ప్రత్యేక అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే పలు సినిమాలు, టీవీ షోల్లో కనిపించారు. తెలుగులో ‘జై బోలో తెలంగాణ’లో‌ ఆమె ఉద్యమకారిణి, తల్లి పాత్ర పోషించారు. అయితే ఆమె కమ్‌బ్యాక్ గురించి ‘అనుపమా’ మేకర్స్ ప్రకటించాల్సి ఉంది.