News October 10, 2024

BREAKING: రతన్ టాటా కన్నుమూత

image

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(86) మరణించారు. అనారోగ్యంతో ఇవాళ ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చేరిన ఆయన కాసేపటి క్రితమే కన్నుమూశారు. టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన మరణాన్ని టాటా గ్రూప్స్ అధికారికంగా ధ్రువీకరించింది.

Similar News

News November 22, 2025

ఈ-రేస్ కేసులో ఏసీబీ రిపోర్ట్.. నిందితులు వీరే

image

TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్టు బయటికొచ్చింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డి, A4గా కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఈ-రేస్ కంపెనీ FEO పేర్లను పొందుపరిచింది. 2024 డిసెంబర్ 19న కేసు నమోదవగా ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక పంపింది. కాగా ఈ కేసులో ఛార్జ్‌షీట్ నమోదుకు, కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ గవర్నర్ ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.

News November 22, 2025

‘ఫ్రీ స్కూటీ స్కీమ్’.. PIBFactCheck క్లారిటీ

image

‘ప్రధానమంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్’ పేరుతో SMలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా ఫేక్‌ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తారని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని PIBFactCheck తేల్చింది. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సందర్శించాలని పేర్కొంది.

News November 22, 2025

బ్లీచ్‌ చేయించుకుంటున్నారా?

image

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.