News October 21, 2024
రతన్ టాటా నాకూ సలహాలిచ్చేవారు: బ్రిటన్ మాజీ PM

చంద్రుడి సౌత్‌పోల్‌లో రోవర్‌ను దించిన చంద్రయాన్3 సహా అనేక అంశాల వల్ల భారత్‌పై వెస్ట్ దృష్టికోణం మారిందని బ్రిటన్ మాజీ PM డేవిడ్ కామెరాన్ అన్నారు. జాగ్వార్‌ను టాటా కొనడంతో UKలో జపాన్ పెట్టుబడుల్ని భారత్ దాటేసిందన్నారు. ‘టాటా పెట్టుబడి నాకో వేకప్ కాల్. ప్రపంచ స్థాయికి భారత ఎకానమీ ఎదిగిందని, గొప్ప పనులు చేయబోతోందని గ్రహించాను. నేను PMగా ఉన్నప్పుడు రతన్ టాటా నాకు సలహాదారుగా ఉండేవారు’ అని అన్నారు.
Similar News
News November 12, 2025
అండ దానం గురించి తెలుసా?

వయసు పైబడిన మహిళలు, పదే పదే ఐ.వి.ఎఫ్‌లు ఫెయిల్ అయిన వాళ్లకు అండాల అవసరం ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ బ్యాంకుల నుంచి మాత్రమే అండాలను తీసుకోవలసి ఉంటుంది. గతంలో ఏ మహిళైనా, ఎన్నిసార్లైనా తమ అండాలను అమ్ముకోగలిగే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు 23 నుంచి 35 ఏళ్ల మహిళలు మాత్రమే ఎగ్ డొనేషన్‌కు అర్హులు. అలాగే ఒక మహిళ తన జీవిత కాలంలో, కేవలం ఒక్కసారి మాత్రమే అండాలను డొనేట్ చేయాలి.
News November 12, 2025
26/11 తరహా దాడులకు ప్లాన్?

2008లో ముంబైలో జరిగిన 26/11 తరహా దాడులకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ టెంపుల్ సహా ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు సమాచారం. పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ కూడా ఈ లిస్టులో ఉన్నట్లు నిఘావర్గాలు తెలిపాయి. రిపబ్లిక్ డే రోజు దాడులకు ప్లాన్ చేశారని, కట్టుదిట్టమైన భద్రత, నిఘా వల్ల ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పాయి.
News November 12, 2025
కుటుంబం అంతమైనా బుద్ధి మారలేదు!

ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ <<17727105>>కుటుంబం<<>> అంతమైనా ఆ ఉగ్రవాద సంస్థ బుద్ధి తెచ్చుకోవట్లేదు. తాజాగా ఢిల్లీ పేలుడు ఘటనతో JeM లింకులు బయటపడ్డాయి. 2001 పార్లమెంట్ అటాక్, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై అటాక్స్, 2019 పుల్వామా అటాక్‌లో వందలాది అమాయకులను ఆ టెర్రరిస్టులు పొట్టనబెట్టుకున్నారు. JeM నాయకత్వ వికేంద్రీకరణ, పాక్ ISI సపోర్ట్‌తో రెచ్చిపోతున్నారు.


