News October 7, 2024

ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రతన్ టాటా

image

బీపీ తగ్గడంతో తాను తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరానని వస్తోన్న వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఖండించారు. వృద్ధాప్యం దృష్ట్యా తాను జనరల్ చెకప్ కోసం మాత్రమే ఆస్పత్రికి వెళ్లినట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని కోరారు.

Similar News

News July 6, 2025

రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు ఎన్నంటే?

image

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మొత్తం 171 కాలేజీల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. కన్వీనర్ కోటాలో 70శాతం సీట్లు ఉండగా 76,795 సీట్లను ఈ కోటాలో భర్తీ చేయనుంది. ఈ నెల 8తో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది.

News July 6, 2025

జింబాబ్వేతో మ్యాచ్.. ముల్డర్ డబుల్ సెంచరీ

image

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ (264*) డబుల్ సెంచరీతో విజృంభించారు. 259 బంతులు ఎదుర్కొని 34 ఫోర్లు, 3 సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. ఆట తొలి రోజే ముల్డర్ డబుల్ సెంచరీ బాదడం విశేషం. కాగా ముల్డర్ ఐపీఎల్‌లో SRHకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే ఒక మ్యాచ్ ఆడి 9 రన్స్ చేశారు.

News July 6, 2025

అదరగొట్టిన ఆకాశ్‌దీప్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత బౌలర్ ఆకాశ్‌దీప్ సత్తా చాటారు. 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. తన కెరీర్‌లో ఒక ఇన్నింగ్సులో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్ లాంటి స్టార్ బ్యాటర్లను ఔట్ చేయడం విశేషం.