News October 10, 2024
పార్సీ సంప్రదాయం ప్రకారం రతన్ టాటా అంత్యక్రియలు!

రతన్ టాటా అంత్యక్రియలు పార్సీ సంప్రదాయం ప్రకారం జరిగే అవకాశం ఉంది. జొరాస్ట్రియన్లు దేహాన్ని ప్రకృతివరంగా భావిస్తారు. గాలి, నీరు, నిప్పు కలుషితం కాకుండా తిరిగి ప్రకృతికే సమర్పిస్తారు. గద్దలు, రాబందులకు ఆహారంగా ఉంచుతారు. అయితే ప్రస్తుతం పార్సీలు ఎక్కువగా పర్యావరణహితం కోసం ఎలక్ట్రిక్ క్రిమెటోరియంలను ఆశ్రయిస్తున్నారు. రతన్ టాటా అంత్యక్రియలూ అలాగే జరిగే అవకాశం ఉంది.
Similar News
News November 25, 2025
బలవంతపు వాంతులతో క్యాన్సర్: వైద్యులు

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.
News November 25, 2025
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మరోవైపు మలక్కా జలసంధి వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని పేర్కొంది. వీటి ప్రభావంతో NOV 29 నుంచి DEC 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
News November 25, 2025
ఆంధ్ర అరటికి.. ఆజాద్పుర్ మండీ వ్యాపారుల హామీ

AP: అరటి ధర పతనంతో కొందరు రైతులు పండిన పంటను చెట్లకే వదిలేశారు. మరి కొందరు పశువులకు మేతగా వేశారు. ఈ తరుణంలో AP నుంచి నాణ్యమైన అరటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీలోని ఆజాద్పుర్ మండీ పండ్ల వ్యాపారులు హామీ ఇచ్చారు. AP అధికారులు నిన్న ఢిల్లీలో ‘బయ్యర్ సెల్లర్స్ మీట్’ నిర్వహించి అక్కడి వ్యాపారులతో చర్చించగా.. 10-15 రోజుల్లో AP నుంచి అరటిని కొంటామని ఆజాద్పుర్ మండీ వ్యాపారులు హామీ ఇచ్చారు.


