News October 10, 2024

ఇవాళ సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ముంబైలో జరగనున్నాయి. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉ.10.30 గంటలకు NCPA గ్రౌండ్‌కు తరలించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

Similar News

News January 9, 2025

పిల్లలకు జన్మనిస్తే రూ.81,000.. యువతులకు ఆఫర్

image

రష్యాలో గత ఏడాది జననాలు తగ్గడంతో ఆ దేశంలోని కరేలియా యంత్రాంగం సంచలన ప్రకటన చేసింది. 25 ఏళ్ల లోపు యువతులు ఆరోగ్యకరమైన చిన్నారులకు జన్మనిస్తే రూ.81,000 ఇస్తామని ప్రకటించింది. కరేలియాకు చెందిన వారై స్థానికంగా చదివేవారిని అర్హులుగా పేర్కొంది. అయితే ఇప్పటికే పిల్లలున్న వారికి ఇది వర్తించదని తెలిపింది. ఇతర ప్రాంతాలు ఇదే విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నాయి.

News January 9, 2025

అధికారుల సేవ TTD కంటే TDPకే ఎక్కువ: అంబటి

image

AP: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో ఘోరం జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ‘అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఆఫీసర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఏం సాధించారు? అధికారులను తిడితే సమస్యలు పరిష్కారమవుతాయా? ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News January 9, 2025

గతంలోలాగే ఏర్పాట్లు.. ఈవోపై సీఎం ఫైర్

image

AP: టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లాగే ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామల రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఎవరో చేశారని నువ్వు అలానే చేస్తావా? నీకంటూ కొత్త ఆలోచనలు లేవా?’ అంటూ ప్రశ్నించారు. సాంకేతికతను ఎందుకు వాడుకోలేదని ఈవోను నిలదీశారు.