News October 10, 2024
రతన్ టాటా పేరు చరిత్రలో నిలిచిపోతుంది: పవన్

AP: రతన్ టాటా ప్రతి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచే మహోన్నత వ్యక్తి అని, ఆయన పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని Dy.CM పవన్ కళ్యాణ్ కొనియాడారు. టాటా మరణం దేశానికి తీరని లోటన్నారు. ఉప్పు నుంచి విమానయాన రంగం వరకు భారతదేశపు అణువణువులో టాటా పేరు ప్రతిధ్వనించేలా చేశారని తెలిపారు. టాటా అంటే పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప మానవతావాదిగా సమాజసేవ చేశారని పవన్ ట్వీట్ చేశారు.
Similar News
News November 28, 2025
SNBNCBSలో ఫ్యాకల్టీ పోస్టులు

సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ (SNBNCBS) ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్డీ(అప్లైడ్ సైన్స్/ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం ఉండాలి. జీతం అసిస్టెంట్ ప్రొఫెసర్కు నెలకు రూ.78,800, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ.1,23,100 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.bose.res.in/
News November 28, 2025
టాక్సిక్ వర్క్ కల్చర్లో పనిచేస్తున్నా:గర్భిణి ఆవేదన

ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కొందరు మేనేజర్లు ఇబ్బందిపెడుతుంటారు. అలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్లో ఇబ్బందిపడుతున్న 28 వారాల గర్భంతో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని చేసిన రెడిట్ పోస్ట్ వైరలవుతోంది. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యానని,103°F జ్వరంలోనూ మేనేజర్ సెలవు నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీవ్ అడిగితే ఫోన్ చేసి తిట్టారని ఆమె ఆరోపించారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది.
News November 28, 2025
అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

AP: రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రికి సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతికి మరింత ఆర్థిక సాయం అందించాలని కోరారు.


