News April 1, 2025
రతన్ టాటా వీలునామా.. వెలుగులోకి మరో విషయం

గత ఏడాది కన్నుమూసిన రతన్ టాటాకు దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాటిలో అత్యధిక భాగం ఆయన ఛారిటీకి కేటాయించినట్లు ఓ కథనం వెల్లడించింది. దాదాపు రూ.3,800cr సంపదను రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, ట్రస్ట్కు కేటాయిస్తూ వీలునామా రాసినట్లు సమాచారం. అలాగే తన సవతి సోదరీమణులకు ₹800cr, సన్నిహితుడు మొహిన్ ఎం దత్తాకు ₹800cr, ఇతర కుటుంబ సభ్యులకూ ఆస్తులను రాశారు. తన శునకాల సంరక్షణకూ నిధులను కేటాయించారు.
Similar News
News April 5, 2025
ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి: ఉత్తమ్

TG: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్లోపు మొదటిదశ పూర్తి కావాలని నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులను ఆదేశించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెణ జలాశయాల పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసి, నీరు నిల్వ చేయాలని సూచించారు. అటు జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపడతామని పేర్కొన్నారు.
News April 5, 2025
నన్ను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేది: చెన్నయ్య

TG: ప్రియుడి కోసం రజిత అనే మహిళ <<15981487>>ముగ్గురు కన్నబిడ్డలను<<>> చంపేయడంతో భర్త చెన్నయ్య కన్నీరుమున్నీరవుతున్నారు. తనను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేదని రోదిస్తున్నారు. ‘బిడ్డలకు విషం పెట్టి చంపి ఆత్మహత్యాయత్నం చేసినట్లు రజిత నాటకం ఆడింది. పిల్లలు చనిపోయారని చెబితే ఆమెకు చుక్క కన్నీరు రాలేదు. ఆమెను చంపేయడమే మంచిది. ఎన్కౌంటర్ చేయండి. అదే సరైన న్యాయం’ అని కోరుతున్నారు.
News April 5, 2025
7, 8 తేదీల్లో 2 జిల్లాల్లో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. 7న పెదపాడులో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 8న అరకు సమీపంలో సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు.