News February 4, 2025
రతన్ టాటా యువ స్నేహితుడికి కీలక పదవి

దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు టాటా కంపెనీలో కీలక పదవి దక్కింది. స్ట్రాటజీస్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్, GMగా నియమితులైనట్లు శంతను LinkedInలో పోస్ట్ చేశారు. తన తండ్రి టాటా మోటార్స్ ప్లాంట్‌లో పని చేసేటప్పుడు వైట్ షర్ట్, నేవీ కలర్ ఫ్యాంట్ ధరించేవారని పేర్కొన్నారు. ఆయన కోసం తాను కిటికీ దగ్గర కూర్చొని ఎదురు చూసేవాడినని చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
Similar News
News March 19, 2026
ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు: CM CBN

AP: జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం అని CM CBN స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6L+ ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగిందన్నారు. ‘ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. <<19422391>>10,060 ప్రభుత్వ ఉద్యోగాలు<<>> భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
News March 19, 2026
వార్ ఎఫెక్ట్.. పెరగనున్న సిమెంట్ ధరలు?

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల ప్రభావం దేశంలోని సిమెంట్ ధరలపైనా పడే అవకాశం ఉంది. MAR నెలాఖరు లేదా APR మొదటి వారంలో ధరలు పెరగొచ్చని నువామా రిపోర్ట్ వెల్లడించింది. పెట్‌కోక్, ప్యాకేజింగ్ ధరలు పెరుగుతుండటంతో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు డీలర్లు ప్రైస్ పెంచొచ్చని తెలిపింది. సిమెంట్ తయారీకి వాడే పెట్రోలియమ్ కోక్ (పెట్ కోక్)ను చమురు నుంచి వెలికితీస్తారు. క్రూడ్ ధరల హైక్‌తో పెట్ కోక్ ధరలూ పెరుగుతున్నాయి.
News March 19, 2026
‘పుష్ప-2’ రికార్డు బద్దలైంది!

‘ధురంధర్-2’ భారత సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ‘బుక్ మై షో’లో ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 1.09 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో ఈ రికార్డు పుష్ప-2 (1.07 లక్షలు) పేరిట ఉండేది. వీకెండ్స్‌లో ఈ మూవీ టికెట్ సేల్స్ మరింతగా పెరుగుతాయని, భారీ కలెక్షన్లు పక్కా అని నెటిజన్లు అంటున్నారు. కాగా గతేడాది వచ్చిన ధురంధర్ దాదాపు రూ.1,350 కోట్లు వసూలు చేసింది.


